‘లూసిఫర్’ కోసం హరీష్ శంకర్‌ను సంప్రదించనున్న చిరు..

మెగాస్టార్ చిరంజీవికి అత్యంత నచ్చిన సినిమాల్లో ఒకటి మలయాళ సినిమా ‘లూసిఫర్’. ఈ చిత్రంలో మోహన్ లాల్ పాత్రతో పాటు కథా కథనం అన్నీ చిరును బాగా ఆకట్టుకున్నాయి. దీంతో ఈ సినిమాను రీమేక్ చేసే ఆలోచనలో మెగాస్టార్ ఉన్నట్టు తెలిసిందే. ‘ఆచార్య’ షూటింగ్ పూర్తవగానే ఆ సినిమాను పట్టాలెక్కించాలని చిరు భావిస్తున్నట్టు సమాచారం. ఈ లోగా ప్రి ప్రొడక్షన్ వర్క్ అంతా కంప్లీట్ కావాలి. కానీ దర్శకుడి విషయంలో కాస్త కన్ఫ్యూజన్ కొనసాగుతోంది.

అయితే మలయాళానికి ఏమాత్రం తీసిపోకుండా.. రీమేక్ చేయగలిగే దర్శకుడి కోసం చిరు చూస్తున్నట్టు తెలుస్తోంది. డైరెక్టర్ బాబీ, సుజిత్ వంటి వారు స్ర్కిప్ట్‌పై వర్క్ చేసినా వారు మాత్రం చిరును ఆకట్టుకోలేకపోయారని సమాచారం. ఆ తరువాత వి.వి. వినాయక్ పేరు వినిపించినప్పటికీ ఆయన తరువాత ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్టు వార్తలొస్తున్నాయి. దీంతో చిరు హరీష్ శంకర్‌తో ఈ సినిమాను చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.

కాగా.. హరీష్ మాత్రం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కోసం ఎదురు చూస్తున్నారని తెలుస్తోంది. అయితే పవన్ ఇప్పటికే ‘వకీల్ సాబ్’ షూటింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పూర్తవగానే క్రిష్ దర్శకత్వంలో నటించనున్నారు. దీంతో పవన్‌తో హరీష్ సినిమాకు టైం పట్టే అవకాశముందని తెలుస్తోంది. ఈ లోగా ‘లూసిఫర్‌’ను లైన్‌లో పెట్టాలని మెగాస్టార్ భావిస్తున్నారట. త్వరలోనే మెగాస్టార్.. హరీష్ శంకర్‌ను ‘లూసిఫర్’ కోసం సంప్రదించనున్నట్టు తెలుస్తోంది. దీనిపై అధికారిక సమాచారం వెలువడితే కానీ క్లారిటీ రాదు.

More News

హైదరాబాద్ సీన్.. తిరిగి యూపీలో రిపీట్ అయింది..

లాక్‌డౌన్ సమయంలో హైదరాబాద్‌లో ఒక తండ్రి తన కుమారుడితో బైక్‌పై వెళుతుంటే పోలీసులు అడ్డుకుని నానా హంగామా చేశారు.

ఆ ఎమ్మెల్యే సమ్‌థింగ్ స్పెషల్...

బిహార్‌కు చెందిన సీపీఐ ఎమ్మెల్యే మహబూబ్ ఆలమ్ గురించి ఓ ఆసక్తికర వార్త వైరల్ అవుతోంది.

క‌ళ్యాణ్ దేవ్ 'కిన్నెర‌సాని' టైటిట్ లుక్ పోస్ట‌ర్ విడుద‌ల‌

హ్యాపెనింగ్ యంగ్ హీరో క‌ళ్యాణ్ దేవ్, యంగ్ డైరెక్ట‌ర్ ర‌మ‌ణ తేజ(అశ్వ‌ధామ ఫేమ్) కాంబినేష‌న్ లో ప్ర‌ముఖ నిర్మాత రామ్ త‌ళ్లూరి నిర్మాణ సార‌థ్యంలో

‘ఆహా’ గ్రాండ్ రివీల్ ఈవెంట్‌

డిఫరెంట్ కంటెంట్‌తో తెలుగు ప్రేక్ష‌కుల హృద‌యాల‌ను చూర‌గొన్న తెలుగు ఓటీటీ మాధ్య‌మం ‘ఆహా’.

తెలంగాణలో గవర్నర్ కోటాలో ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే..

ఖాళీగా ఉన్న మూడు ప్రభుత్వ నామినేటెడ్ ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది.