చిన్నారికి చిరంజీవి ఫిదా.. బర్త్ డే రోజున ఏం చేసిందంటే..
- IndiaGlitz, [Tuesday,June 01 2021]
మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న సేవా కార్యక్రమాలపై ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. విపత్కర సమయంలో చిరు తన సొంత ఖర్చుతో ప్రతి జిల్లాలో ఆక్సిజన్ బ్యాంక్స్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. సరైన సమయానికి ఆక్సిజన్ అందక కరోనా పేషంట్లు చాలా మంది ఇటీవల ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
అలాంటి పరిస్థితులు తలెత్తకుండా చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్స్ ఏర్పాటుని యుద్ధ ప్రాతిపదికన చేశారు. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆక్సిజన్ బ్యాంక్స్ ఏర్పాటు జరిగింది. అయితే ఓ చిన్నారి తన పుట్టిన రోజున తీసుకున్న గొప్ప నిర్ణయం చిరంజీవి మనసుని కదిలించింది.
ఇదీ చదవండి: మెగాస్టార్ ఆక్సిజన్ బ్యాంక్స్ పై ఎమ్మెల్యే కామెంట్
శ్రీనివాస్, హరిణి దంపతుల కుమార్తె అన్షి ప్రభాల. ఈ రోజు చిన్నారి అన్షి పుట్టినరోజు. కానీ తన పుట్టినరోజు వేడుకని జరుపుకునేందుకు అన్షి ఇష్టపడలేదు. అందరూ సంతోషంగా ఉన్నప్పుడే ఎలాంటి వేడుకలైనా జరుపుకోవాలి. ఈ విపత్కర సమయంలో బర్త్ డే సెలెబ్రేట్ చేసుకోవడం ఆ చిన్నారికి సరైనదిగా అనిపించలేదట.
అందుకే తాను దాచుకున్న డబ్బు, బర్త్ డే కి అయ్యే ఖర్చు మొత్తాన్ని చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ కి ఇచ్చేసింది. ఈ డబ్బు చిరంజీవి అంకుల్ ఏర్పాటు చేసిన ఆక్సిజన్ బ్యాంక్స్ కి ఉపయోగపడాలనేది ఆ చిన్నారి కోరిక. చిన్నారి అన్షి గొప్ప మనసుకు చిరంజీవి ఫిదా అయ్యారు.
వెంటనే సోషల్ మీడియా వేదికగా చిరు ఈ విషయాన్ని తెలియజేశారు. చిన్నారిని అభినందించారు. చిన్నారికి బర్త్ డే విషెష్ చెబుతూ చిరు మురిసిపోయారు.
What a beautiful gesture Anshi!! I am so touched.
— Chiranjeevi Konidela (@KChiruTweets) June 1, 2021
You are a wonderful girl. God Bless you!! #AnshiPrabhala #ChiranjeeviOxygenBanks @Chiranjeevi_CT @AlwaysRamCharan pic.twitter.com/VTnQkHNDDP