లేడీ జర్నలిస్ట్‌కు క్షమాపణలు చెప్పిన చిరంజీవి
Send us your feedback to audioarticles@vaarta.com
‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ఎన్నికల పోరు ముగిసింది.. ఫలితాలు కూడా వచ్చాయి.. ఊహించని మెజార్టీతో సీనియర్ నటుడు నరేశ్ ప్యానెల్ గెలిచింది. ఇంతా ఓకే కాసేపు ఓటింగ్ ప్రక్రియ దాకా వెళ్దాం అసలేం జరిగిందో తెలుస్తుంది. మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున ఇద్దరూ కలిసి ఓటేయడానికి వచ్చి.. ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం ‘మా’ కార్యాలయం నుంచి దిగొస్తుండగా.. ఆయన్ను చూసిన అభిమానులు, పలువురు జనసేన కార్యకర్తలు ‘జై చిరంజీవ.. జై మెగాస్టార్... జై పవర్ స్టార్’ నినాదాలతో హోరెత్తించారు.
అయితే చిరు మాత్రం స్పందించకుండా తిన్నగా జనాల్లో నుంచి కారు దగ్గరికి వెళ్లడానికి ప్రయత్నించారు. అయితే ఈ క్రమంలో పలువురు సెల్ఫీలు తీసుకోగా.. మళ్లీ యథావిథిగా స్లోగన్స్ మొదలయ్యాయి. చిరు మాత్రం నవ్వుతూ బయల్దేరారు. ఈ క్రమంలో ఒక లేడీ జర్నలిస్ట్ (తెలుగులో టాప్ చానెల్ రిపోర్టర్) చిరుతో మాట్లాడాలని ప్రయత్నించారో లేకుంటే పొరపాటున ఆమె కాలును చిరు తొక్కాడేమోగానీ అమ్మా.. క్షమించు.. అంటూ క్షమాపణలు కోరిన చిరు.. రిపోర్టర్ బుగ్గలు నిమిరి నవ్వుతూ సారీ అమ్మా.. తల్లీ ఏ ఫీల్ కాకు అంటూ నవ్వుతూ కారెక్కి చిరు వెళ్లిపోయారు.
ఇప్పుడు ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన మెగాభిమానులు, జనసేన కార్యకర్తలు వావ్ చిరుగారు సూపర్ అంటూ.. మరికొందరు నెటిజన్లు.. లవ్ యూ సార్.. ఏదైనా మీ తర్వాతే అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇంకొందరు.. అందుకే సార్ మిమల్ని మెగాస్టార్ అని అందరూ అంటారని కామెంట్స్ చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments