'అన్నయ్య'కి 18 ఏళ్ళు
Send us your feedback to audioarticles@vaarta.com
తమ్ముళ్లని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే ఓ అన్న కథతో తెరకెక్కిన చిత్రం 'అన్నయ్య'. మెగాస్టార్ చిరంజీవి, సౌందర్య జంటగా నటించిన ఈ చిత్రానికి సెంటిమెంట్ చిత్రాల స్పెషలిస్ట్ ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించారు. ఇందులో చిరంజీవి తమ్ముళ్ళుగా రవితేజ, వెంకట్ నటించగా...సౌందర్యకి చెల్లెళ్ళుగా చాందిని, శిష్వా నటించారు. సిమ్రాన్ ఒక పాటలో తళుక్కున మెరిసింది.
ఈ సినిమా ప్రథమార్థంలో తమ్ముళ్ళను అమితంగా ప్రేమించి వారు ఏమన్నా, ఏం చేసినా వెనకేసుకు వచ్చే రాజారామ్‌గా చిరంజీవి ఎంత చక్కగా నటించారో....ద్వితీయార్థంలో అదే తమ్ముళ్ళు చెప్పుడు మాటలు విని తనని మోసం చేసారని తెలిసినా.. చాలా హుందాగా వారి పట్ల ప్రేమనే కురిపించే వెర్షన్‌లో కూడా అంతే చక్కగా నటించారు. ఒక్క మాటలో చెప్పాలంటే గతంలో చిరంజీవి, ముత్యాల సుబ్బయ్య కాంబినేషన్లో వచ్చిన హిట్లర్` సినిమాకి రివర్స్ ట్రీట్ మెంట్‌గా ఈ సినిమా ఉంటుంది. చెల్లెళ్ళ సెంటిమెంట్ ప్రధానంగా హిట్లర్ రూపొందితే.. తమ్ముళ్ళ సెంటిమెంట్ ప్రధానంగా అన్నయ్య రూపొందింది.
చెల్లెళ్ళపై సౌందర్య ప్రేమని కూడా చాలా చక్కగా చూపించారు దర్శకుడు. ఒక విధంగా పిల్లల్ని పెంచే విధానంలో తల్లికి, తండ్రికి ఉండే వ్యత్యాసాన్ని ఈ రెండు పాత్రల్లో చూపించారు. అంతర్లీనంగా భావోద్వేగాలు ఎంతలా ఆకట్టుకుంటాయో, ఇందులోని కామెడీ సన్నివేశాలు కూడా అంతే చక్కగా అలరిస్తాయి. ముఖ్యంగా చిరు బాడీ లాంగ్వేజ్ కి సరిపోయేటట్లు రూపొందించిన "నా తమ్ముళ్ళు జెమ్స్" అనే మేనరిజం బాగా వర్కవుట్ అయ్యింది.
అలాగే చిరు చేసిన ఆత్మారామ్ అనే పాత్ర (రాజారామ్ ఆత్మ) మాస్‌ని బాగా ఎంటర్‌టైన్ చేసింది. ఇక పాటల విషయానికొస్తే మణిశర్మ స్వరపరచిన పాటలన్నీ ప్రజాదరణ పొందాయి. జనవరి 7, 2000న విడుదలైన 'అన్నయ్య'.. 92 సెంటర్లలో 50 రోజులు, 60 సెంటర్లలో శతదినోత్సవం జరుపుకుంది. చిరంజీవి కెరీర్లో సూపర్ హిట్ ఫిలింగా నిలిచిన ఈ చిత్రం విడుదలై నేటితో 18 వసంతాలు పూర్తయ్యాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com