గుడ్‌బై మై ఫ్రెండ్.. రిషి కపూర్ మృతిపై చిరు ట్వీట్

బాలీవుడ్‌ను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మృతి చెంది 24 గంటలు గడవక మునుపే బాలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. గురువారం ఉదయం దిగ్గజ నటుడు, సీనియర్ హీరో రిషి కపూర్ (67) కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా కేన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన ముంబైలోని హెచ్‌ఎన్ రిలయన్స్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఇప్పటికే ఇర్ఫాన్ మరణంతో బాలీవుడ్ శోఖ సంద్రంలో ఉండగా ఇలా మరో చేదు వార్త వినాల్సి వచ్చింది. ఇద్దరూ కూడా కేన్సర్‌తో చనిపోవడం బాధాకరం.

గుడ్‌బై మై ఫ్రెండ్!

ఆయన మృతిపట్ల బాలీవుడ్, టాలీవుడ్ సినీ,రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటించారు.
మరీ ముఖ్యంగా బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ ప్రముఖులందరూ స్పందించారు. తాజాగా మెగా బ్రదర్స్.. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. రిషితో తనకున్న అనుబంధాన్ని చిరు పంచుకున్నారు. ‘రిషీ కపూర్ ఇక లేరని తెలిసి చాలా బాధపడ్డాను. ఆయన నాకు గొప్ప స్నేహితుడు.. గొప్ప నటుడు కూడా. ఎంతో మంది హృదయాలను గెలుచుకున్న వ్యక్తి రిషీ. గొప్ప వారసత్వానికి వారధి. ఆయన లేని లోటు నా గుండెను పగిలేలా చేసింది. గుడ్‌బై మై ఫ్రెండ్. మీ ఆత్మకు శాంతి చేకూరాలి’ అని చిరు ట్విట్టర్‌లో తీవ్ర భావోద్వేగానికి లోనవుతూ రాసుకొచ్చారు.

సంచలన తార కనుమరుగైంది..

రిషి కపూర్ సినీ వినీలాకాశంలో తళుక్కుమని మెరిసిన సంచలన తార. ఆ తార ఇప్పుడు కనుమరుగైపోయాడని తెలిసి చాలా చాలా బాధనిపించింది. ఆయన మరణంతో భారతీయ చిత్ర పరిశ్రమ ఒక ఆణిముత్యాన్ని కోల్పోయింది. ఆయన మృతి చిత్ర పరిశ్రమకు తీరని లోటు. సినిమా యవనికపై ఆయన ఒక సంచలనం. తొలి సినిమాతోనే అగ్రస్థాయి నాయకునిగా అగ్రపథానికి చేరుకున్న రిషి కపూర్ ఎందరో ఔత్సాహిక కథానాయకులకు స్ఫూర్తిగా నిలిచారు. తండ్రి రాజ్ కపూర్ తోపాటు కపూర్ కుటుంబంలో అప్పటికే ఎందరో హీరోలు, గొప్ప నటులు ఉన్నప్పటికీ తనకంటూ ఒక ప్రత్యేక స్టైల్‌ను రిషీ కపూర్ సృష్టించుకున్నారు. ఒక గొప్ప నటుడు ఇర్ఫాన్ ఖాన్ మరణించి ఒక్క రోజు కూడా గడవకముందే రిషి కపూర్ మరణ వార్త వినవలసి రావడం దురదృష్టకరం. రిషికు భారమైన హృదయంతో కళాంజలి ఘటిస్తున్నాను’ అని పవన్ ప్రకటనలో పేర్కొన్నారు.

కాగా.. మెగా బ్రదర్స్‌తో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్, సూపర్ స్టార్ మహేశ్‌బాబుతో పాటు పలువురు నటీనటులు రిషి కపూర్ మృతికి ప్రగాఢ సంతాపం తెలిపి.. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

More News

మరో విషాదం.. దిగ్గజ నటుడు రిషి కపూర్ కన్నుమూత

బాలీవుడ్‌ను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మృతి చెంది 24 గంటలు గడవక మునుపే బాలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది.

మగవారికే ‘కరోనా’ ఎక్కువగా సోకడం వెనుక..!

కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ వైరస్ థాటికి ప్రపంచ దేశాల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. ఇప్పటికే కరోనా దెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది మృత్యువాతపడ్డారు.

‘ఆచార్య’ నుంచి కాజల్ కూడా ఔట్.. ఇందుకేనా!

మెగాస్టార్ చిరంజీవి- కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘ఆచార్య’. కరోనా లాక్‌డౌన్‌తో సినిమా షూటింగ్ ఆగిపోయింది కానీ.. ఇప్పటికే సుమారు 70 శాతం

కరోనాకు వ్యాక్సిన్ రెడీ.. ఫస్ట్ ఇండియన్స్‌కే ఛాన్స్!

ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి కరోనా వైరస్‌కు ఇంతవరకూ మందు లేదు. అసలు మందు ఎప్పుడు తయారవుతుందో కూడా తెలియట్లేదు.

కంటతడి పెట్టిస్తున్న ఇర్ఫాన్ చివరి మాటలు!

ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ అరుదైన కేన్సర్‌తో బాధపడుతూ బుధవారం నాడు తుదిశ్వాస విడిచిన విషయం విదితమే. 2018 మార్చి నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న