ఒకే రోజున చిరంజీవి, ప్రభాస్ పోటీ?
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా టైటిల్ పాత్రలో నటిస్తున్న ప్రెస్టీజియస్ చిత్రం `సైరా నరసింహారెడ్డి`. చిరంజీవి 151వ చిత్రమిది. 200 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రం దక్షిణాది భాషలతో పాటు హిందీలో కూడా విడుదలవుతుంది. ఈ చిత్రాన్ని వేసవిలో విడుదల చేయాలని ముందుగా నిర్మాతలు భావించారు.
అయితే ఫిలింనగర్ వర్గాల వార్తల ప్రకారం ఈ చిత్రాన్ని ఆగస్ట్ 15న విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారట. అందుకు కారణంగా ఇది స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందడమే. అయితే అసలు సమస్య ఏంటంటే అదే రోజున ప్రభాస్ టైటిల్ పాత్రలో నటిస్తున్న సాహో సినిమా విడుదలవుతుందని వార్తలు వినపడుతున్నాయి.
బాక్సాఫీస్ వద్ద రెండు భారీ చిత్రాల పోటీ అంటే డిస్ట్రిబ్యూటర్స్, బయర్లకు కాస్త ఇబ్బందే. మరి ఈ వార్తలపై చిత్ర యూనిట్స్ ఎలా స్పందిస్తాయో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Iniya Vaishnavi
Contact at support@indiaglitz.com
Comments