చిరు మాటను పవన్ వింటాడా?

  • IndiaGlitz, [Monday,March 21 2016]

మెగాబ్రదర్స్ చిరంజీవి, పవన్ కల్యాణ్ మధ్య మనస్పర్ధలున్నాయనుకునే వారికి సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో వేదిక సమాధానమైంది. వేదికపై కలుసుకున్న ఈ అన్నదమ్ములు తమ మనసులోని భావాలను పంచుకున్నారు. ముఖ్యంగా చిరంజీవి, తమ్ముడు పవన్ కల్యాణ్ సినిమాల నుండి రిటైర్ అవుతాడని చెప్పడం బాగోలేదని, ఎందుకంటే సినిమాల్లో వచ్చిన ఆదరణ దేవుడి దయ అని అన్నారు.

అంతే కాకుండా జోడు గుర్రాలపై స్వారీ చేసే సత్తా పవన్ కు ఉందని, కాబట్టి సినిమాల నుండి తప్పుకోనవసరం లేదని, పవన్ తన మాట కాదనడని అనుకుంటున్నానని కూడా చిరంజీవి అన్నారు. మరి రెండు మూడేళ్ల తర్వాత సినిమా రంగం నుండి తప్పుకుంటానని అనుకుంటున్న పవన్ అన్నయ్య మాట వింటాడా? చూడాలి..