Naatu Naatu Song : భారతీయులందరూ గర్వపడేలా చేశారు .. ఆర్ఆర్ఆర్‌కు ఆస్కార్ రావడంపై చిరు, పవన్ హర్షం
Send us your feedback to audioarticles@vaarta.com
ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ అవార్డ్ రావడం పట్ల యావత్ భారతీయ చిత్ర పరిశ్రమ పులకించిపోతోంది. ఎన్నో ఏళ్లు కలగా మిగిలిపోయిన ఆస్కార్ ఇప్పుడు కోరి మనల్ని వరించింది. అమెరికాలోని లాస్ ఏంజెల్స్ వేదికగా 95వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా జరిగింది. ‘అప్లాజ్’ (టెల్ ఇట్ లైక్ ఏ ఉమెన్), ‘లిఫ్ట్ మి అప్’ (బ్లాక్ పాంథర్: వకాండా ఫెరవర్), దిస్ ఈజ్ ఎ లైఫ్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్’, ‘హోల్డ్ మై హ్యాండ్’ (టాప్‌గన్ మావెరిక్) పాటలను వెనక్కి నెట్టి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్‌ను దక్కించుకుంది. దీంతో యావత్ భారతీయ చిత్ర పరిశ్రమ పులకించిపోయింది. ఆర్ఆర్ఆర్ ఆస్కార్‌ను దక్కించుకుందని తెలియగానే పలువురు సినీ ప్రముఖులు ఆ చిత్ర బృందానికి విషెస్ తెలియజేస్తున్నారు.
ఒక తండ్రిగా గర్వంగా వుంది: చిరంజీవి
నాటు నాటు పాటకు ఆస్కార్ రావడం పట్ల టాలీవుడ్ అగ్ర కథానాయకుడు చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. చిత్ర యూనిట్‌కు ఆయన అభినందనలు తెలియజేశారు. ఆర్ఆర్ఆర్‌ను ఆస్కార్ రేంజ్‌కు తీసుకెళ్లేందుకు రాజమౌళి, కీరవాణి, చరణ్, ఎన్టీఆర్ ఎంతో శ్రమించారని మెగాస్టార్ కొనియాడారు. ఈ చిత్రంలో చరణ్ భాగస్వామి కావడం ఒక తండ్రిగా తనకు ఎంతో గర్వంగా వుందని చిరు అన్నారు.
భారతీయులందరూ గర్వపడేలా చేశారు : పవన్
అటు జనసేన అధినేత , పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా స్పందించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ’’ భారతీయులందరూ గర్వపడేలా ఆస్కార్ వేదికపై పురస్కారాన్ని స్వీకరించిన ‘ఆర్.ఆర్.ఆర్.’ చిత్ర సంగీత దర్శకులు శ్రీ ఎం.ఎం.కీరవాణి గారికి, గీత రచయిత శ్రీ చంద్రబోస్ గారికి హృదయపూర్వక అభినందనలు. ఈ వార్తను చూడగానే ఎంతో సంతోషించాను. ఆస్కార్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ గా నిలిచిన ‘ఆర్.ఆర్.ఆర్.’ చిత్రంలో ‘నాటు నాటు...’ గీతంలోని తెలుగు పదం నేల నలుచెరగులా ప్రతి ఒక్కరితో పదం కలిపేలా చేసి హుషారెత్తించింది. ఆ హుషారు ఈ రోజు ఆస్కార్ వేదిక మీద రెట్టించిన ఉత్సాహంతో కనిపించింది. ఈ వేదికపై ఈ గీతాన్ని ప్రదర్శించడంతోపాటు... అవార్డు పొందటం ద్వారా భారతీయ సినిమా స్థాయి మరో స్థాయికి చేరింది. ఇంతటి ఘనత పొందేలా ‘ఆర్.ఆర్.ఆర్.’ చిత్రాన్ని రూపొందించిన దర్శకులు శ్రీ ఎస్.ఎస్.రాజమౌళి గారికి ప్రత్యేక అభినందనలు. ఆ చిత్రంలో కథానాయక పాత్రల్లో ఒదిగిపోయిన శ్రీ ఎన్.టి.ఆర్., శ్రీ రాంచరణ్, గాయకులు శ్రీ రాహుల్ సిప్లిగంజ్, శ్రీ కాలభైరవ, నృత్య దర్శకులు శ్రీ ప్రేమ్ రక్షిత్, చిత్ర నిర్మాత శ్రీ డి.వి.వి.దానయ్యలకు అభినందనలు. ‘ఆర్.ఆర్.ఆర్.’ చిత్రానికి దక్కిన ప్రఖ్యాత ఆస్కార్ అవార్డుతోపాటు పలు అంతర్జాతీయ పురస్కారాలు భారతీయ దర్శకులు, నటులు, రచయితలకు స్ఫూర్తినిస్తుంది’’ అని పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com