ఒకే కారులో వచ్చి ఓటేసిన చిరు, నాగ్.. నరేశ్‌దే గెలుపు!

  • IndiaGlitz, [Sunday,March 10 2019]

‘నువ్వా.. నేనా’ అంటూ రసవత్తరంగా జరుగుతున్న ‘మా’ ఎన్నికల్లో.. కొత్త అధ్యక్షుడు ఎవరు అనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. ఇప్పటి వరకూ 200 మందికి పైగా మా సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆదివారం 11 గంటల సమయంలో మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున ఇద్దరూ ఒకే కారులో వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇద్దరూ ఇండస్ట్రీలో బెస్ట్ ప్రెండ్స్ అన్న విషయం తెలిసిందే.

నరేశ్‌‌కేనా కింగ్, మెగాస్టార్ మద్దతు..!?

కాగా.. ఇద్దరూ ఒకే కారులో రావడంతో ఓటేయాడానికి వచ్చిన నటీనటులు ఒకింత షాక్ అయ్యారు. ఇద్దరూ కలిసి రావడంతో ఈ రెండు కుటుంబాల మద్దతు ఒకరికే ఉంటుందని.. ఆయనెవరో కాదు నరేశ్ అని నటులు గుసగుసలాడుకుంటున్నారు. అంతేకాదు సూపర్‌స్టార్ ఫ్యామిలీ అంటే అక్కినేని, మెగా ఫ్యామిలీకి చాలా గౌరవముంది. ఆ ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగినా.. ముఖ్యంగా ఫంక్షన్స్ జరిగితే చాలు చిరు, నాగ్ కచ్చితంగా హాజరవుతుంటారు. అందుకే ఆ కుటుంబం నుంచి అధ్యక్ష పదవి బరిలో ఉన్న నరేశ్‌‌కే ఈ ఇద్దరు టాప్ హీరోల మద్దతు ఉంటుందని తెలుస్తోంది.

నరేశ్‌‌దే అధ్యక్ష పీఠం..!

ఇప్పటికే నరేశ్‌‌దే అధ్యక్ష పీఠం అందరూ అనుకుంటుండగా చిరు, నాగ్ ఇద్దరి సపోర్ట్ ఆయనకేనని తాజాగా తేలిపోయిందని అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే.. మా అధ్యక్ష పదవికోసం ఇంతవరకూ ఎవరూ రెండోసారి పోటీపడిన దాఖలాలు దాదాపు లేవనే చెప్పుకోవచ్చు. ఇది శివాజీ రాజాకు పెద్ద మైనస్ అని.. అప్పట్లో ఫిలింఛాంబర్ ముందు శ్రీరెడ్డి చేసిన వ్యవహారం శివాజీకి మరో మైనస్ అని విశ్లేషకులు చెబుతున్నారు. సో.. అధికారికంగా ప్రకటన కోసం ఆదివారం రాత్రి 8గంటల వరకు వేచి చూడాల్సిందే మరి.

More News

శివాజీ ప్యానెల్ డబ్బులు పంచడం బాధాకరం: నరేశ్

‘మా’ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. బస్తీ మే సవాల్ అంటూ రియల్ లైఫ్‌‌లో శివాజీ రాజా.. నరేశ్ తలపడుతున్నారు.

రికార్డ్ స్థాయిలో ముగిసిన ‘మా’ ఎన్నికల పోలింగ్..

‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ఎన్నికల పోలింగ్ ముగిసింది. గత పది రోజులగా నెలకొన్న తీవ్ర ఉత్కంఠకు 50శాతం తెరపడింది.

కుప్పకూలిన విమానం.. 157 మంది దుర్మరణం..!?

థియోపియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన 737 విమానం(ET 302) ఒకటి కుప్పకూలింది. అదిస్ అబాబా నుంచి నైరోబీకి వెళ్తున్న విమానం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.

వైసీపీ ఎఫెక్ట్.. ఆ పార్టీ గుర్తు పక్కనెట్టిన ఎన్నికల కమిషన్!

ఏపీలో త్వరలో జరగనున్న ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ, జనసేన, కాంగ్రెస్, బీజేపీలతో పాటు ప్రజాశాంతి పార్టీ కూడా తలపడుతున్న సంగతి తెలిసిందే.

టాలీవుడ్‌‌లో ట్రెండ్ సెట్ చేస్తున్న ‘96’ బ్యాక్‌డ్రాప్!

ప్రేమ తాలూకు జ్ఞాపకాల్ని గుర్తుకు తెస్తూ హృద్యమైన ఇతివృత్తంతో రూపొందిన తమిళ చిత్రం ‘96’ ఘన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.