స్టూడియోల కోసం చిరు, బాల‌య్య పోటీ..?

టాలీవుడ్ అగ్ర క‌థానాయ‌కుల్లో చిరంజీవి, బాల‌కృష్ణ పేర్లు ప్ర‌ముఖంగా విన‌ప‌డుతుంటాయి. వీరిద్ద‌రు ఇప్పుడు స్టూడియోల నిర్మాణం కోసం పోటీలు ప‌డుతున్నారంటూ సోష‌ల్ మీడియాలో వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. వివ‌రాల్లోకెళ్తే.. కొత్త‌గా ఏర్ప‌డ్డ తెలుగు రాష్ట్రం వైజాగ్‌లో సినీ ప‌రిశ్ర‌మ ఇంకా అభివృద్ధి కాలేదు. ప్ర‌భుత్వాలు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సినీ ప‌రిశ్ర‌మ‌కు చేయూత‌ను ఇస్తామ‌ని ప‌లు సంద‌ర్భాల్లో చెప్పాయి. అయితే ఇప్పుడిప్పుడే సినీ పెద్ద‌లు ఆంధ‌ప్ర‌దేశ్‌లో సినీ ప‌రిశ్ర‌మ డెవ‌ల‌ప్‌మెంట్ కోసం అడుగులు వేస్తున్నార‌ని తెలుస్తోంది.

మూవీ ఇండ‌స్ట్రీ డెవ‌ల‌ప్‌మెంట్ జ‌ర‌గాలంటే సినిమా షూటింగ్స్ ఎక్కువ‌గా జ‌ర‌గాలి. అంటే.. సినిమా షూటింగ్స్‌కు సంబంధించిన మౌలిక స‌దుపాయాలు ఏర్పాటు చేయాలి. అందుకోసం స్టూడియోలు నిర్మాణం జ‌ర‌గాలి. ఇప్ప‌టికే వైజాగ్‌లో రామానాయుడు స్టూడియో ఉంది. దీన్ని డెవ‌ల‌ప్ చేయ‌డానికి సురేష్‌బాబు త‌న వంతు ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు. కాగా మ‌రో ప‌క్క మెగాస్టార్ చిరంజీవి, నంద‌మూరి బాల‌కృష్ణ కూడా స్టూడియోలు నిర్మించాల‌ని అనుకుంటున్నార‌ట‌. తెలుగుదేశం ప్ర‌భుత్వం అధికారంలో ఉన్న‌ప్పుడే బాల‌కృష్ణ స్టూడియో నిర్మాణం కోసం స్థ‌లం కేటాయించాలంటూ అప్లికేష‌న్ పెట్టుకున్నాడు. కానీ అప్ప‌ట్లో ఎందుక‌నో చంద్ర‌బాబు అప్లికేష‌న్‌ను పెండింగ్‌లో ఉంచేశాడు. ఇప్పుడు జ‌గ‌న్ ఫ్ర‌భుత్వం వ‌చ్చింది క‌నుక అప్లికేష‌న్ గురించి ప‌ట్టించుకోవ‌డం లేద‌ని టాక్. అదే స‌మ‌యంలో చిరంజీవి త‌న‌కు తెలిసిన ప్ర‌భుత్వ పెద్ద‌ల స‌హ‌కారంతో జ‌గ‌న్ వ‌ద్ద స్టూడియో నిర్మాణానికి స్థ‌లం కేటాయించాలంటూ విజ్ఞ‌ప్తి చేశారంటూ వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. మ‌రి స్టూడియోల నిర్మాణం కోసం చిరంజీవి, బాల‌కృష్ణ నిజంగానే పోటీ ప‌డుతున్నారా? ప‌డితే ఎవ‌రికి ముందుగా ప‌ర్మిష‌న్ వ‌స్తుంది? అనే విష‌యాలు తెలియాలంటే మాత్రం వేచి చూడాల్సిందే.

More News

క్రేజీ కాంబినేష‌న్.. నిజ‌మెంత‌?

కొన్ని కాంబినేష‌న్స్ పేర్లు విన‌గానే అంద‌రిలో సినిమా ఎలా ఉంటుంది? , ఎప్పుడు ఉంటుంది?, అస‌లు ఈ కాంబినేష‌న్‌లో సినిమా ఉంటుందా?

మల్లేశ్వరి బయోపిక్‌లో బాలీవుడ్ హీరోయిన్‌

ఇండియ‌న్ సినిమాల్లో బ‌యోపిక్స్ ట్రెండ్ కొన‌సాగుతోంది. రాజ‌కీయ‌, సినీ, క్రీడ‌లు స‌హా ప‌లు రంగాల్లో అత్యున్న‌త సేవ‌లు అందించిన ప‌లువురి జీవిత చ‌రిత్ర‌లు వెండితెర‌పై ఆవిష్కత‌మ‌వుతున్నాయి.

డిజిటల్ ద్వారా అల్లరోడి సినిమా..!

అల్ల‌రి చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చి నేటిత‌రం హీరోల్లో కామెడీ స్టార్‌గా పేరు సంపాదించుకుని యాబై సినిమాల‌ను పూర్తి చేశాడు అల్ల‌రి న‌రేశ్‌.

ఎన్టీఆర్ 30.... ద‌స‌రాకే!!

కరోనా ప్రభావంతో ఏర్ప‌డ్డ లాక్‌డౌన్ కార‌ణంగా థియేట‌ర్స్ బంద్ కావ‌డం..

త‌న పెళ్లిపై సెటైర్ వేసిన హ‌న్సిక‌

హీరోయిన్స్ కాస్త స‌క్సెస్ అయిన త‌ర్వాత కొన్నేళ్లు ఇండ‌స్ట్రీలో రాణించిన త‌ర్వాత వారికి రెగ్యుల‌ర్‌గా ఎదుర‌య్యే ప్ర‌శ్న మీ పెళ్లెప్పుడు?