చిరు - బన్నీలతో మల్టీస్టారర్ .. శ్రీకాంత్ అడ్డాల డైరెక్టర్, సెట్టయితే మెగా ఫ్యాన్స్‌కి పండగే..!!
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్‌కు ఒక జబ్బుంది. అదేంటంటే ఒక జోనర్లో ఒక సినిమా హిట్టయితే అదే కథాంశంతో మూవీలు క్యూకడుతూ వుంటాయి. ఇది బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచి వుంది. తాజాగా తెలుగు చిత్ర సీమలో మల్టీ స్టారర్ల ట్రెండ్ మొదలైంది. జూనియర్ ఎన్టీఆర్- రామ్‌చరణ్‌ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘‘ఆర్ఆర్ఆర్’’ మూవీ తర్వాత పవన్ కల్యాణ్- రానాల కలయికలో ‘‘భీమ్లా నాయక్’’, శర్వానంద్- సిద్ధార్ధ్లతో ‘‘మహా సముద్రం’’ తెరకెక్కాయి. రానున్న కాలంలో ఈ ట్రెండ్ మరింత ఊపందుకునే అవకాశం వుందని టాలీవుడ్ వర్గాల సమాచారం. అగ్ర హీరోలతో మల్టీస్టారర్లు చేయాలని పలువురు దర్శకులు స్క్రిప్ట్ వర్క్‌లో వున్నారట.
ఈ నేపథ్యంలో ఓ న్యూస్ వైరల్ అవుతోంది. మెగాస్టార్ చిరంజీవి- అల్లు అర్జున్ కాంబినేషన్లో ఓ సినిమా రాబోతోందని.. శ్రీకాంత్ అడ్డాల దీనికి దర్శకత్వం వహిస్తారన్నది ఆ వార్త సారాంశం. చిరుకు శ్రీకాంత్ అడ్డాల ఓ కథ వినిపించారట. ఆ కథకు మెగాస్టార్ సానుకూలంగా స్పందించారని, పూర్తి స్క్రిప్ట్‌ను సిద్ధం చేయన్నారని సమాచారం. ఇందులో చిరంజీవితో పాటు మరో కీలకమైన పాత్రకు అల్లు అర్జున్ అయితే బాగుంటుందని శ్రీకాంత్ సూచించారని ఫిలింనగర్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే బన్నీ ఈ ప్రాజెక్టులో చేరే అవకాశం లేకపోలేదు. గతంలో మావయ్య చిరంజీవి నటించిన ‘డాడీ’, ‘శంకర్‌దాదా జిందాబాద్’ చిత్రాల్లో అల్లు అర్జున్ కనిపించిన సంగతి తెలిసిందే. కానీ అవన్నీ అతిథి పాత్రలే. ఇప్పుడు శ్రీకాంత్ అడ్డాల కథకు మెగాస్టార్ ఓకే అంటే గనుక చిరంజీవితో కలిసి ఫుల్ లెంగ్త్ మూవీలో నటించినట్లుగా అవుతుంది. అసలు సినిమా పట్టాలెక్కుతుందా..? లేదంటే గాసిప్‌గా మిగిలిపోతుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com