ఉయ్యాలవాడ వారసుల గురించి చిరంజీవి ఏమన్నారంటే?
Send us your feedback to audioarticles@vaarta.com
బ్రిటీష్‌వారిని ఎదిరించిన తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితగాథను ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన చిత్రం `సైరా నరసింహారెడ్డి`. ఈ సినిమా మేకింగ్ సమయంలో ఉయ్యాలవాడ వారసులు మెగా కుటుంబం తమకు ఆర్ధికంగా సాయం చేస్తామని చెప్పి చేయడం లేదంటూ ఆందోళనలు చేశారు. అయితే దీనిపై ఇప్పటికే మెగా క్యాంప్ వివరణ ఇచ్చేసింది. వందేళ్లు దాటిన తర్వాత వంశీయుల అనుమతి అక్కర్లేకుండా చరిత్ర కారుల సినిమాలను తెరకెక్కించవచ్చుననేది సుప్రీమ్ కోర్ట్ చెప్పి ఉంది. దీనిపై మరోసారి మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ ఇంటర్వ్యూలోనూ స్పందించారు.
``ఉయ్యాలవాడ వంశీకులు అమాయకులు. వారిని ఎవరో మాపైకి ఉసిగొల్పారు. వాళ్లకు ఆర్ధిక సాయం చేయాలని ఎన్.వి.ప్రసాద్‌గారిని పురమాయించినప్పుడు, వంశీకులు మాత్రం తాము 23 కుటుంబాలున్నాం. కుటుంబానికి రెండు కోట్లు చొప్పున 50 కోట్లు డిమాండ్ చేయడం మొదలు పెట్టారు. అది మంచి నిర్ణయం కాదు కదా. అదీకాక పాతిక కుటుంబాల వారికి ఏదో ఇచ్చాక మరికొందరు మేం కూడా వారసులమంటూ రారని గ్యారెంటీ ఏమినీ ప్రశ్నిస్తే మేం తప్ప మరొకరు రారంటూ వారు పత్రాలు రాసిచ్చారు. అంతే తప్ప, వాళ్లతో మేం ఏమీ ఒప్పందం కుదుర్చుకోలేదు. కానీ నిజా నిజాలు తెలుసుకోకుండా కొన్ని టీవీ చానెళ్లు సోషల్ మీడియాలో మేం మాటిచ్చి తప్పామంటూ వివాదం చేశారు. నిజంగా సైరా సినిమాకు మంచి లాభాలు వస్తే.. ఆ ప్రాంతానికి ఏదైనా చేయాలని భావిస్తున్నాం`` అన్నారు చిరంజీవి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout