close
Choose your channels

'తేజ్ ఐ ల‌వ్ యు' చిత్రం తొలి ప్రేమ అంతా పెద్ద హిట్ కావాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాను - చిరంజీవి

Sunday, June 10, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా, అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా క్రియేటివ్‌ కమర్షియల్స్‌ మూవీ మేకర్స్‌ పతాకంపై ఎ.కరుణాకరన్‌ దర్శకత్వంలో క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామారావు నిర్మిస్తున్న చిత్రం 'తేజ్‌'.

ఐ లవ్‌ యు అనేది ఉపశీర్షిక. గోపీ సుంద‌ర్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం శ‌నివారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. మెగాస్టార్ చిరంజీవిముఖ్య అతిథిగా హాజ‌రై ఆడియో సీడీల‌ను ఆవిష్క‌రించారు.

ఈ సంద‌ర్భంగా...మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ - "తేజుపై ప్రేమ కంటే కె.ఎస్‌.రామారావుగారిపై అభిమానం, ప్రేమ‌తో ఈ ఫంక్ష‌న్‌కి వ‌చ్చాను. ఆయ‌న నా ప్రియ‌మైన మిత్రుడు, న‌చ్చిన నిర్మాత‌. ఇది నిజం. త‌ర్వాతే తేజు, క‌రుణాక‌ర‌ణ్ అంద‌రూ లిస్టులో వ‌స్తారు. 80వ ద‌శ‌కంలో చిరంజీవికి ఎక్కువ శాతం సూప‌ర్‌డూప‌ర్ హిట్ చిత్రాలు ఉన్నాయ‌న్నా, చిరంజీవి న‌వ‌లా క‌థ‌నాయ‌కుడు అనే పేరు తెచ్చుకున్నా, చిరంజీవికి ఎవ‌రికీ లేన‌న్ని సూప‌ర్‌హిట్ సాంగ్స్‌, ముఖ్యంగా ఇళ‌య‌రాజాగారి నుండి వ‌చ్చాయ‌న్నా, అప్ప‌టి దాకా సుప్రీమ్ హీరో అని అభిమానులు అభిమానంతో బిరుదులు ఇచ్చినా, మెగాస్టార్ అని ఈరోజు ఆప్యాయంగా, ముద్దుగా పిలుస్తున్న పేరు ఎవ‌రిచ్చారు అని చూసుకుంటే.. అన్నింటికి దొరికే స‌మాధాన‌మే క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్‌. ఆ బ్యాన‌ర్‌తో నాకు ఎంతో అవినాభావ సంబంధం ఉంది.

1982లో అభిలాష‌, చాలెంజ్‌, రాక్ష‌సుడు, మ‌ర‌ణ‌మృదంగం వంటి వ‌రుస హిట్స్ వ‌చ్చాయంటే. అలాంటి క‌థాంశాల‌ను సినిమాలుగా ఎన్నుకోవాలి. అలాంటి సినిమాలను ప్రేక్ష‌కుల ముందుకు హృద్యంగా తీసుకు వ‌చ్చామంటే అందులో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు కె.ఎస్‌.రామారావుగారి గురించే. అభిలాష సినిమా స‌మ‌యంలో ఆయ‌న‌తో ప‌రిచ‌యం అయ్యింది. అప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న‌తో సినిమా చేయాల‌ని ఉన్నా, ఎలాంటి సినిమా చేయాల‌నే దానిపై క్లారిటీ లేని స‌మ‌యంలో మా అమ్మ‌గారు అభిలాష అనే న‌వ‌ల చ‌దివారు. అందులో హీరో పేరు కూడా చిరంజీవి. అది చ‌దువుతున్నంత సేపు నువ్వే గుర్తుకొచ్చావు, నిన్నే ఊహించుకుని క‌థ చ‌దివాను. దాన్ని సినిమాగా తీస్తే బావుంటుంద‌ని అమ్మ‌గారు చెప్పారు.

దాంతో నేను చెన్నై వెళ్లిన‌ప్పుడు రామారావుగారు నన్నుక‌లిసి, యండ‌మూరి వీరేంద్ర‌నాథ్‌గారు రాసిన అభిలాష న‌వ‌ల గురించి చెప్పి, సినిమా చేస్తామా బాస్‌! అన్నారు. అప్ప‌టికే అమ్మ‌గారు ఆ సినిమా గురించి చెప్పి ఉండ‌టంతో నేను కూడా పెద్ద‌గా స‌మ‌యం తీసుకోలేదు. ఎస్‌.. చెప్పాను. ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో నేను చెప్ప‌న‌క్క‌ర్లేదు. 80 ద‌శ‌కంలో నాకు అన్ని హిట్స్ వ‌చ్చి ఎక్కువ మంది ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ పొందానంటే అందుకు ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణ కె.ఎస్‌.రామారావుగారే. నా కెరీర్‌లో ఆయ‌న కంట్రిబ్యూష‌న్‌ను నేను మ‌ర‌చిపోలేను. ఈ సంద‌ర్బంగా ఆయ‌న‌కు థాంక్యూ. ఆ బ్యాన‌ర్‌లో క‌మ‌ర్షియ‌ల్ అనే పేరున్నా కూడా ఆయ‌న డ‌బ్బులు కోసం ఎప్పుడూ సినిమాలు తీయ‌లేదు.

అత్య‌ద్భుత‌మైన సినిమాలు తీయాలి, వాటి ద్వారా నేను నిరంతరం బ్ర‌తికి ఉండాలి అని ఆలోచిస్తుంటారు. నిర్మాత‌లు వ‌స్తుంటారు.. పోతుంటారు. కానీ కె.ఎస్‌.రామారావుగారు స్థిరంగా నిల‌బడ్డారంటే కారణం ఆయ‌న అభిరుచి, అభిలాషే కార‌ణం. నాకు, రామారావుగారికి మ‌ధ్య ఎక్కువ గ్యాప్ ఏర్ప‌డింది. చెన్నై నుండి ఇండ‌స్ట్రీ హైద‌రాబాద్‌కు షిఫ్ట్ అయిన‌ప్పుడు ముందుగా వ‌చ్చింది ఆయ‌నే. మేమందరం ఆలోచించినా కూడా రామారావుగారికి ఇండ‌స్ట్రీ ఇక్క‌డ అభివృద్ధి చెందాల‌నే కోరిక బ‌లంగా ఉండేది. నా కార‌ణంగానే ఆ బ్యాన‌ర్‌లో స్టూవ‌ర్టుపురం పోలీస్ స్టేష‌న్ అనే ఫెయిల్యూర్ స్టోరీ ఇచ్చాను. అది కూడా నా త‌ప్పిద‌మే. క‌థ ఆయ‌న‌కు న‌చ్చింది. డైరెక్ట‌ర్‌గా యండ‌మూరి వీరేంద్ర‌నాథ్‌ను పెట్టాల‌నుకున్నాం. అయితే అప్ప‌టికే ఆయ‌న చేసిన అగ్నిప్ర‌వేశం పెద్ద‌గా స‌క్సెస్ కాలేదు. మ‌రో డైరెక్ట‌ర్‌ని పెడ‌దామా? అని రామారావుగారు అన్నా కూడా నేను వ‌ద్ద‌నే అన్నాను. త‌ర్వాత సినిమా చేశాం.

ఆ సినిమా ఫెయిల్ కావ‌డానికి నేనే కార‌ణం అని అప్ప‌ట్లో ఆయ‌న పెద్ద మ‌న‌సుతో ఒప్పుకున్నారు. ఎవ‌రి త‌ప్పు కాదు కానీ.. ఎక్క‌డో మిస్ ఫైర్ అయ్యింది. ఆరోజు రామారావుగారి అభిరుచి మేర డైరెక్ట‌ర్‌ని మార్చుంటే, రిజ‌ల్ట్ మ‌రోలా ఉండేదేమో. నేను ప‌ట్టు బ‌ట్ట‌డంతో నాకు ఇప్ప‌టికీ గిల్టీఫీలింగ్ ఉంది. మెగాఫ్యామిలీతో సినిమా చేయాల‌నుంద‌ని కోరిక వెలిబుచ్చారు. ఇప్పుడు సాయిధ‌ర‌మ్‌తో సినిమా చేయ‌డం ద్వారా కాస్త సంతృప్తి చెందాన‌ని ఆయ‌న నాకు చెప్ప‌డం జ‌రిగింది.

ఇటీవ‌ల రామ్‌చ‌ర‌ణ్ నాతో మాట్లాడుతూ.. నాన్న నేను కె.ఎస్‌.రామారావుగారితో సినిమా చేయాల‌నుంది. త‌ప్ప‌కుండా ఓ సినిమా చేస్తాను అన్నాడు. ఎందుకు అని అడిగితే మీకు, ఆయ‌న‌కు నేను పుట్ట‌క ముందు నుండే అనుబంధం ఉంది. ఆయ‌న అభిరుచి, టెస్ట్‌ఫుల్ నిర్మాత అని తెలుసు. రాజ‌మౌళిగారి త‌ర్వాత సినిమా చేయాల్సి వ‌స్తే.. కె.ఎస్‌.రామారావుగారి సినిమానే చేస్తాను అని అన్నాడు. ఏ డైరెక్ట‌ర్ అయిన పరావాలేదు అని అన్నాడు. నేను, చ‌ర‌ణ్ ద‌గ్గ‌ర మాట కూడా క‌న్‌ఫ‌ర్మ్ చేసుకున్నాను. ఈ యువ త‌రం హీరోలు కూడా కె.ఎస్‌.రామారావుగారితో సినిమా చేయాల‌నుకుంటున్నారంటే నేను ఆయ‌నేంటో ప్రత్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ద‌టీజ్ క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్‌. ఈ సినిమా త‌ప్ప‌కుండా విజ‌యం సాధిస్తుంద‌ని, ఈ సినిమాతో వైభ‌వాన్ని తెచ్చుకుంటార‌ని భావిస్తున్నాను. గ‌ట్టి న‌మ్మ‌కం ఉంది.

అందుకు ప్ర‌ధాన కారణం, క‌రుణాక‌ర‌న్‌. ఎందుకంటే .. ల‌వ్‌స్టోరీస్ చేయడంలో ఆయ‌న‌కు ఆయ‌నే సాటి. ఆయ‌న డైరెక్ట్ చేసిన తొలిప్రేమ సినిమా నాకు ఎంతో ఇష్ట‌మైన‌ది. మా ప‌వ‌న్ యాక్ట్ చేసిన సినిమా. ఆ సినిమా ఇప్ప‌టికీ ప్ర‌తి సీన్ క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు అనిపిస్తుంటుంది. అంటే డైరెక్ట‌ర్‌గా క‌రుణాక‌ర‌ణ్ ఎంత ఇంపాక్ట్ చూపించారో అర్థం చేసుకోవాలి. అలాగే బ‌న్నితో హ్యాపీ సినిమా చేశారు. ఆయ‌న కూడా గ్యాప్ తీసుకున్నారు. యంగ్ డైరెక్ట‌ర్స్ గ్యాప్ తీసుకోకూడ‌దు. ఈ సినిమాతో క‌రుణాక‌ర‌ణ్ తొలిప్రేమ అంత‌టి హిట్ కొట్టాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాను. క‌రుణాక‌ర‌ణ్ నాకు పెద్ద ఫ్యాన్‌.

మా తేజు గురించి చెప్పాలంటే.. నా నుండి వీళ్లంద‌రికీ ఇమేజ్ మాత్ర‌మే కాదు.. క‌ష్ట‌ప‌డే మ‌న‌స్త‌త్వం సంక్ర‌మించింది. డాన్సులు, ఫైట్స్ చేయ‌డం కాదు.. ఒళ్లు వంచి, ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకుని ప‌నిచేస్తున్నామా లేదా? అంద‌రితో అనుబంధంలో ఉన్నామా? లేదా? అనేదే నాకు ప్ర‌ధానం. మా ఫ్యామిలీ అంద‌రూ హీరోలు చ‌క్క‌గా నడుచుకుంటున్నారు.

ఆ ర‌కంగా తేజు.. నా గుడ్ బుక్స్‌లో ఎప్పుడూ ముందుంటాడు. నాకు తేజు ఆ అవ‌కాశం ఇవ్వ‌లేదు. ఇవ్వ‌డు కూడా!. ఈ సినిమా ర‌షెష్ చూశాను. చాలా చాలా క‌న్నుల పండుగ‌గా సినిమా ఉంది. క‌చ్చితంగా అల‌రించే ఫ్యామిలీ ల‌వ్‌స్టోరీ ఇది. చ‌క్క‌గా చిత్రీక‌రించారు. గోపీసుంద‌ర్‌.. చ‌క్క‌టి మ్యూజిక్ ఇచ్చారు. పాట‌ల‌ను బాగా ఎంజాయ్ చేశాను. అమ‌ప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ గ్లామ‌ర్‌గా క‌న‌ప‌డింది. చ‌క్క‌టి పెర్ఫామ‌న్స్ ఇచ్చింది. త‌న‌కు కూడా అభినంద‌న‌లు. అండ్రూ సినిమాటోగ్ర‌పీ చాలా బావుంది. సాహి సురేశ్ ఆర్ట్ ప‌నిత‌నం, ఎడిట‌ర్ శేఖ‌ర్‌, డైలాగ్ రైట‌ర్ డార్లింగ్ స్వామి స‌హా ప్ర‌తి ఒక్క‌రికీ అభినంద‌న‌లు" అన్నారు.

కె.ఎస్‌.రామారావు మాట్లాడుతూ - "చిరంజీవిగారు మేన‌ల్లుడు కోసం ఈ ఫంక్ష‌న్‌కి రాలేదు. నా మీద అభిమానంతో, ప్రేమ‌తో ఈ ఫంక్ష‌న్‌కి వ‌చ్చారు. అందుకే ఆయ‌న మెగాస్టార్ అయ్యారు. ఆయ‌న్ను చూస్తే వెంక‌టేశ్వ‌ర‌స్వామినో, శివ ప‌ర‌మాత్ముడినో చూసిన‌ట్లు అనిపిస్తుంది. ఆయ‌న క‌ళ్లో ఏదో మాయ ఉంది. ధైర్యంగా ఆయ‌న క‌ళ్ల‌లో ఎవ‌రూ చూడ‌లేరు. అయితే ఆయ‌న ఎంతో ప్రేమ‌గా అంద‌రితో ఉంటాడు. ఆయ‌న్ను చూసి ఈ ఇండ‌స్ట్రీ చాలా నేర్చుకోవాల్సి ఉంది. ఇప్ప‌టికీ ఆయ‌న అంత మ‌ర్యాద‌పూర్వ‌కంగానే మొదులుతుంటారు.

ఆయ‌న‌లాంటి మ‌నిషిని మ‌నం చూసి ఉండం. ఆయ‌న‌కు త‌ప్ప ఇండియాలోనే మ‌రెవ‌రినీ మ‌నం మెగాస్టార్ అని పిలుకోం. అది చిరంజీవిగారికి మాత్ర‌మే సాధ్య‌మైంది. ఆయ‌న్ని చూసి ఇండ‌స్ట్రీ ఇంకా చాలా నేర్చుకుని ఇంకా ఎద‌గాల‌ని కోరుకుంటున్నాను. ఈ సినిమా ఇంత బాగా రావ‌డానికి అంద‌రూ తోడ్ప‌డ్డారు. గోపీసుంద‌ర్ మ్యూజిక్‌, అండ్రూ సినిమాటోగ్ర‌ఫీ ఇలా అన్ని సినిమాకు ఎసెట్ అయ్యాయి.క‌రుణాక‌ర‌న్‌ని బాధ పెట్టినందుకు త‌న‌కు సారీ!. త‌న‌ను కంగారు పెట్టిన సంద‌ర్భాలు చాలానే ఉన్నాయి.

ఆయ‌న నేనేం చెబుతున్నానో అర్థం చేసుకుని నాకు కావాలిన విధంగా సినిమాను అందంగా తీసిపెట్టాడు. తొలిప్రేమ గురించి అంద‌రూ చెబుతున్నారు. కానీ తేజ్ ఐల‌వ్ యు చిత్రాన్ని ఇంకా గొప్ప ల‌వ్‌స్టోరీగా తీశారు. అందులో అనుప‌మ‌ని అండ్రూ అందంగా చూపించారు. క‌రుణాక‌ర‌న్‌, డార్లింగ్ స్వామి డైలాగ్స్‌ను చాలా చ‌క్క‌గా రాశారు" అన్నారు.

సాయిధ‌ర‌మ్ తేజ్ మాట్లాడుతూ - "మా ఇంట్లో మా మావ‌య్య(చిరంజీవి)గారి ఫోటో ఉంటుంది. నిద్ర లేవ‌గానే ఆయ‌న ముఖం చూసి గుడ్ మార్నింగ్ చెప్ప‌డంతో రోజుని స్టార్ట్ చేస్తాను. ఆయ‌న ఆశీర్వాదం లేకుండా రోజు గ‌డ‌వ‌దు. ఆయ‌న మాకు ఎప్పుడూ అండ‌గా నిల‌బ‌డి ఉంటాను.

ఇంత మంచి సినిమా ఇచ్చిన నిర్మాత కె.ఎస్‌.రామారావుగారికి, మంచి రోల్ ఇచ్చిన క‌రుణాక‌ర‌ణ్ గారికి, అద్బుత‌మైన మ్యూజిక్ ఇచ్చిన గోపీసుంద‌ర్‌గారు స‌హ‌క‌రించిన అందరికీ థాంక్స్‌" అన్నారు.

ఎ.క‌రుణాక‌ర‌ణ్ మాట్లాడుతూ - "నేను అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా ఉన్న‌ప్పుడు రోజూ అన్న‌య్య ముఖం చూడ‌టానికి కోడంబాకం బ్రిడ్జ్‌పై నిల‌బ‌డేవాడిని. సినిమా క‌ల‌ను పెద్దన్న‌య్య చిరంజీవిగారు ఇస్తే.. సినిమా ఇచ్చింది చిన్న‌న్న‌య్య ప‌వ‌న్‌క‌ల్యాణ్‌గారు. ఇప్పుడు నా త‌మ్ముడితో సినిమా చేస్తున్నాను" అన్నారు.

హ‌రీశ్ శంక‌ర్ మాట్లాడుతూ - "చిరంజీవిగారి క‌ళ్లు చాలా అందంగా ఉంటాయి. ఈ మాట నేను అన్న‌ది కాదు.. డైరెక్ట‌ర్ బాపుగారు చిరంజీవిగారికి ఇచ్చిన కాంప్లిమెంట్‌. ఈ వేడుక‌కి చిరంజీవిగారు రావ‌డం... మాకు ప‌దికోట్లు కాదు, వంద‌కోట్ల సినిమా తీసుకోవ‌డానికి మాకు ఇచ్చే ఇన్‌స్పిరేష‌న్‌గా భావిస్తుంటాం. మా గ‌బ్బ‌ర్‌సింగ్ ఆడియో, సుబ్ర‌మ‌ణ్యం ఆడియో వేడుక‌ల‌కు ఆయనే అతిథిగా వ‌చ్చి విషెష్ చెప్పారు.

తేజు లాంటి స్టార్ మా త‌మ్ముడైయ్యాడు. సినిమాలు డిస‌ప్పాయింట్ చేయ‌వ‌చ్చు కానీ.. తేజ్ ప‌ట్టుద‌ల‌లో డిసప్పాయింట్‌మెంట్ ఉండ‌దు. త‌న ప‌ట్టుద‌ల‌లో లోపం ఉండ‌దు. తొలిప్రేమ త‌ర్వాత అలాంటి విజ‌యాన్ని తేజుకి క‌రుణాక‌రణ్‌గారు ఇస్తార‌ని భావిస్తున్నాం.

మెగాభిమానుల‌కు కె.ఎస్‌.రామారావుగారు మెమర‌బుల్ హిట్స్ ఇచ్చారు. అదే బాట‌లో ఇది కూడా స‌క్సెస్ అవుతుంద‌ని బావిస్తున్నాను. గోపీసుంద‌ర్‌కి ఇదొక బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ అవుతుంది. అనుప‌మ స‌హా ఎంటైర్ టీమ్‌కి ఆల్ ది బెస్ట్‌" అన్నారు.

మ్యూజిక్ డైరెక్ట‌ర్ గోపీసుంద‌ర్ మాట్లాడుతూ - "మా అమ్మ‌గారు చిరంజీవిగారికి పెద్ద ఫ్యాన్‌. ఆయ‌న ఈ సినిమాకు ముఖ్య అతిథిగా రావ‌డం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా మ్యూజిక్ ప్రేక్ష‌కుల‌కు, అభిమానుల‌కు త‌ప్ప‌కుండా న‌చ్చుతుంది" అన్నారు.

అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ మాట్లాడుతూ - "కె.ఎస్‌.రామారావుగారి ప్యాష‌న్‌, సినిమా ప‌ట్ల అభిరుచి అంత లెవ‌ల్‌లో ఉంటుంది. ఇంత పెద్ద బ్యాన‌ర్‌లో భాగ‌మైనందుకు ఆనందంగా ఉంది. క‌రుణాక‌ర‌ణ్‌గారు తొలిప్రేమ‌, డార్లింగ్ వంటి గ్రేట్ సినిమాలు చేశారాయ‌న‌. అలాంటి డైరెక్ట‌ర్‌తో ప‌నిచేయ‌డం నా అదృష్టం.

గ‌ర్వంగా ఉంది. అండ్రూ గారు కెమెరాతో మ్యాజిక్ చేశారు. ప్ర‌తి సీన్‌ను పొయెటిక్‌గా చూపించారు. తేజ్‌.. కూలెస్ట్ కోస్టార్‌. చాలా పెర్ఫామ‌ర్‌. మంచి డాన్సర్‌. గోపీసుంద‌ర్‌గారు డిఫ‌రెంట్ మ్యూజిక్ ఇచ్చారు. సినిమాలో మాకు స‌హ‌కారం అందించిన అంద‌రికీ థాంక్స్‌" అన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment