ఆగ‌స్ట్‌కు వెళ్లిన ఆచార్య‌..?

మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం ‘ఆచార్య‌’. మెసేజ్ మిక్స్ చేసిన క‌మ‌ర్షియ‌ల్ చిత్రాల‌ను తెర‌కెక్కించే ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. నిరంజ‌న్ రెడ్డి, రామ్‌చ‌ర‌ణ్ నిర్మాత‌లు. హైద‌రాబాద్‌లో చిత్రీక‌ర‌ణ శ‌ర‌వేగంగా జ‌రుగుతున్న సమయంలో కరోనా వైరస్ ప్రభావంతో చిత్రీకరణ ఆగింది. ఇప్పుడు సినీ పెద్ద‌లు షూటింగ్స్ నిమిత్తం ప్ర‌భుత్వాల ద‌గ్గ‌ర నుండి అనుమ‌తులు తీసుకునే ప‌నిలో ఉన్నారు. విధి విధానాల‌పై చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లోనే రెగ్యుల‌ర్ షూటింగ్స్‌కు సంబంధించి ఓ క్లారిటీ రానుంది. నిజానికి జూన్‌లోనే షూటింగ్స్ స్టార్ట్ అవుతాయ‌ని అంద‌రూ అనుకున్నారు కానీ.. ప్ర‌భుత్వం నుండి షూటింగ్స‌కు సంబంధించి ఎలాంటి గ్రీన్ సిగ్న‌ల్స్ రాలేదు.

లేటెస్ట్ స‌మాచారం మేర‌కు ఆచార్య సినిమా నెక్ట్స్ షెడ్యూల్ ఆగ‌స్ట్‌లో స్టార్ట్ అవుతుంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ఈ షెడ్యూల్‌లో రెండు పాట‌లు, ఓ యాక్ష‌న్ ఎపిసోడ్‌ను చిత్రీక‌రిస్తార‌ని అంటున్నారు. ఈ షెడ్యూల్‌లో కాజ‌ల్ అగ‌ర్వాల్ కూడా పాల్గొంటుంద‌ని టాక్‌. ఈ చిత్రంలో చిరంజీవి మాజీ న‌క్స‌లైటు పాత్ర‌లో క‌న‌ప‌డ‌తార‌ట‌. ప‌ర్యావ‌ర‌ణ స‌మ‌తుల్యం దెబ్బ‌తిన‌నీయ‌కుండా పోరాడే వ్య‌క్తి పాత్ర‌లో క‌న‌ప‌డ‌తార‌ట‌. సినిమాలో చిన్నపాటి రాజ‌కీయాంశాలు కూడా ముడిప‌డి ఉంటాయ‌ట‌. అలాగే ఫ్లాష్ బ్యాక్‌లో మెగాప‌వ‌ర్ స్టార్ న‌క్స‌లైట్ లీడ‌ర్ పాత్ర‌లో క‌న‌డ‌ప‌డ‌తాడ‌ని, ఆ పాత్ర వ‌ల్ల‌నే చిరు మార్గ‌నిర్దేశం పొందుతాడ‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

More News

థ్రిల్లర్ మూవీ 'A' (AD ‌INFINITUM) టీజర్ ని విడుదల చేసిన  సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్

పరిమిత  బడ్జెట్ తో నిర్మితమైన “A” చిత్రం. ఫస్ట్ లుక్ మరియూ  మోషన్ పోస్టర్ ల విడుదలతో ప్రేక్షకుల  అంచనాలను  పెంచుతుండటం ఆశ్చర్యంగా ఉంది,

ప్ర‌భాస్ 21 : దేవుడు వ‌ర్సెస్ సైన్స్‌

బాహుబ‌లితో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు ప్ర‌భాస్‌. ఆ త‌ర్వాత సాహో అనుకున్నంత స‌క్సెస్ కాక‌పోయిన‌ప్ప‌టికీ ప్ర‌భాస్‌కు వ‌చ్చిన న‌ష్ట‌మేమీ లేదు.

అల‌క‌... అనుపమ వాకౌట్‌

హీరో, హీరోయిన్స్ ముందు ఓ సినిమాకు ఓకే చెప్పేసి త‌ర్వాత ప్రాజెక్ట్ నుండి క్రియేటివ్ డిఫ‌రెనెసెస్ అని కార‌ణం చెప్పి సినిమా నుండి త‌ప్పుకుంటున్నారు.

'నారప్ప' లో సుందరమ్మ గా ప్రియమణి

సురేష్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు వి క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా విక్టరీ ఇంటిపేరు గా చేసుకున్న వెంకటేష్ హీరోగా,

బాల‌య్య .. భారీ పార్టీ

జూన్ 10 నంద‌మూరి అభిమానులకు మ‌ర‌చిపోలేని రోజు. ఎందుక‌నో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్కర్లేదు. నందమూరి బాల‌కృష్ణ పుట్టిన‌రోజు.