మెగా హీరోలు, అభిమానుల సమక్షంలో ఘనంగా జరిగిన మెగాస్టార్ జన్మదిన వేడుక
- IndiaGlitz, [Monday,August 22 2016]
తెలుగు సినీ పరిశ్రమలో చిరు పాత్రలతో నట ప్రస్ధానం ప్రారంభించి...అంచెలంచెలుగా ఎదుగుతూ కోట్లాది హృదయాలను గెలుచుకున్న విజేత మెగాస్టార్ చిరంజీవి. తొమ్మిది సంవత్సరాల గ్యాప్ తరువాత చిరంజీవి కెరీర్ లో అత్యంత ప్రతిష్టాత్మకమైన 150వ చిత్రం చేస్తున్నారు. డైనమిక్ డైరెక్టర్ వినాయక్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ భారీ చిత్రాన్నినిర్మిస్తున్నారు. చిరు 150వ చిత్రం ఖైదీ నెం 150 ఫస్ట్ లుక్ మోషన్ పిక్చర్ ను చిరు పుట్టినరోజు కానుకగా ఈరోజు రిలీజ్ చేసారు. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు. అభిమానులకు పండుగ రోజు. ఈ పండుగను అభిమానులు శిల్పకళావేదికలో ఘనంగా జరుపుకున్నారు.
మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ఖైదీ నెం 150 ఘన విజయం సాధించాలని కోరుకుంటూ తెలుగు రాష్ట్రాల్లో వివిధ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేసిన అభిమాలను మెగా బ్రదర్ నాగబాబు సత్కరించారు. అనంతరం మెగా బ్రదర్ నాగబాబు మాట్లాడుతూ....ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా చాలా సంతోషంగా అన్నయ్య పుట్టినరోజు జరుపుకుంటున్న అభిమానులకు హృదయపూర్వక అభినందనలు. హ్యాపీ బర్త్ డే టు అన్నయ్య అన్నారు.
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ చేతుల మీదుగా అవుట్ స్టాండింగ్ బ్లడ్ డోనర్స్ కు అవార్డ్స్ ను అందచేసారు. అనంతరం అల్లు అరవింద్ మాట్లాడుతూ....ఎక్కువ సార్లు బ్లడ్ డోనేట్ చేసిన వారికి అవుట్ స్టాండింగ్ బ్లడ్ డోనర్స్ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఈ బ్లడ్ బ్యాంక్ 15 సంవత్సరాలు పైగా నడుస్తుంది. ఇన్ని సంవత్సరాలుగా బ్లడ్ బ్యాంక్ సక్సెస్ ఫుల్ గా నడవడానికి మీరంతా (అభిమానులు) కారణం. సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న బ్లడ్ బ్యాంక్ చిరంజీవిగారికి మంచి పేరు తీసుకువచ్చింది. అందుచేత అభిమానులందరికీ శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియచేస్తున్నాను అన్నారు.
రాజకీయా నాయకుడు సి.రామచంద్రయ్య మాట్లాడుతూ...సినీ పరిశ్రమలో చిరంజీవి గారు హిమాలయాలంత ఎత్తుకు ఎదిగారు. కాబట్టి నాకు ఇతంటి స్ధాయి ఇచ్చినందుకు సమాజానికి ఏదో చేయాలని తపిస్తుంటారాయన. అలాంటి వ్యక్తి రాజకీయాల్లో చాలా అరుదుగా కనిపిస్తారు. అందుచేత మీ అందరికీ నా విన్నపం ఏమిటంటే...ప్రస్తుత రాజకీయ వ్యవస్ధ కుళ్లిపోయింది.చిరంజీవి గారు చేసే రాజకీయ ప్రక్షాళనకు మీరంతా సహకరించాలి. ముఖ్యంగా రాజకీయాల్లో చిరంజీవి గార్ని ఇంకా ఎత్తుకు తీసుకెళ్లాలి దానికి అభిమానులు అందరూ సహకరించాలని చేతులు ఎత్తి అడుగుతున్నాను అన్నారు.
అల్లు శిరీష్ మాట్లాడుతూ.... అమితాబ్ బచ్చన్ గారు ఓసారి చిరంజీవి గారు గురించి మాట్లాడుతూ.... ఇండియన్ సినిమాలో ఒకే ఒక్క మెగాస్టార్ చిరంజీవి అన్నారు. అదే ఇప్పుడు నేను చెబుతున్నాను వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి అన్నారు.
హీరోవరుణ్ తేజ్ మాట్లాడుతూ... పెదనాన్న బర్త్ డే ఇంత గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నందుకు థ్యాంక్స్. షూటింగ్ లో బిజీగా ఉన్నా ఈ ఫంక్షన్ మిస్ అవ్వకూడదు అని వచ్చేసాను. పెదనాన్నకు చాలా పెద్ద ఫ్యాన్ ని. ఆయన సినిమాలు ఆపేసి రాజకీయాలకు వెళతాను అన్నప్పుడు గదిలోకి వెళ్లిపోయి ఏడ్చేశాను. చాలా సార్లు పెదనాన్నను మళ్లీ సినిమా చేయమని అడిగాను ఆఖరికి తొమ్మిది సంవత్సరాల తర్వాత సినిమా చేస్తుండడం చాలా సంతోషంగా ఉంది. చిరంజీవి గారు సినిమాలో ఇంతకు ముందులా డ్యాన్స్ చేయగలడా అనుకుంటున్నారు వారందరికీ నా సమాధానం...కాశీకి వెళ్లాడు కాషాయం కట్టాడు తన వరుస మారింది అనుకుంటున్నారేమో...అదే స్పీడు అంటూ డ్యాన్స్ & ఫైట్స్ చిరు అదరగొడతారు అని చెప్పకనే చెప్పారు వరుణ్ తేజ్.
హీరో సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ....ప్రతి సంవత్సరం నేను ఈరోజు కోసం వెయిట్ చేస్తుంటాను. ఇది బర్త్ డే కాదు మోగా పండుగ. గత సంవత్సరం చిరంజీవి గారి పుట్టినరోజు గ్రాండ్ గా జరిగింది. ఈ సంవత్సరం జరుగుతుందా..? లేదా..? అనుకున్నాను. ఈ ఇయర్ కూడా గ్రాండ్ గా చేస్తున్నారు అని తెలిసి హ్యాపీగా ఫీలయ్యాను. ఖైదీ నెం 150 ఫస్ట్ లుక్ అదిరిపోయింది అన్నారు.
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ... నేను ఫస్ట్ టైమ్ మెగాస్టార్ బర్త్ డే సెలబ్రేషన్ లో పాల్గొన్నాను. ఈ పండగలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. బాస్ ఈజ్ బ్యాక్...మీ అందరిలాగే నేను కూడా ఖైదీ నెం 150వ చిత్రం కోసం వెయిట్ చేస్తున్నాను ఆల్ ది బెస్ట్ టు ఖైదీ నెం 150 టీమ్ అన్నారు.
హీరోయిన్ రాశీ ఖన్నా మాట్లాడుతూ... మెగాస్టార్ కి పెద్ద ఫ్యాన్ ని. మెగా ఫ్యాన్స్ లవ్ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. సాయిధరమ్ తేజ్ తో సుప్రీమ్ చేయడం మరచిపోలేని అనుభూతి అన్నారు.
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ మాట్లాడుతూ.... ప్రపంచంలో ఎంతో మంది పెద్ద హీరోలు ఉండచ్చు. కానీ ఇంత పెద్ద రేంజ్ లో ఫంక్షన్ చేసే అభిమానులు మాత్రం ఎవరికీ ఉండరు. ఈ సందర్భంగా మెగా ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్స్. ధృవ ఫస్ట్ లుక్ అదిరింది అన్నారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాట్లాడుతూ... గత పది రోజులుగా అభిమానులు చేసిన సేవా కార్యక్రమాలు.. పూజలు..చూసి చాలా హ్యాపీగా ఫీలయ్యాను. అభిమానులు చూపించే ప్రేమకు ఎప్పటికీ రుణపడే ఉంటాం. కొన్ని సార్లు కుటుంబ సభ్యులు మేమా..? అభిమానులా..? అని అనిపిస్తుంటుంది. ఎప్పటికీ మీ నుంచి నేర్చుకుంటున్నాం. సినిమాలు హిట్ అవ్వచ్చు ఫ్లాప్ అవ్వచ్చు. కానీ... ఎప్పడూ మరనిది మీ అభిమానం. మీ అభిమానాన్ని కేర్ లెస్ గా చూడలేదు అలా చూడం కూడా..! నాన్న గారు ఇక్కడ ఉంటే బాగుంటుంది అనిపించింది. అయితే..ఈసారి నాకు బన్ని తేజుకి మీ అందరి సమక్షంలో నాన్న గారి పుట్టినరోజు జరుపుకునే అవకాశం ఇచ్చారు. నేను ఓన్ ప్రొడక్షన్ హౌస్ పెట్టాలని అనుకోలేదు. నాన్నగారు సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పుడు మామ అరవింద్ గారి పేరే అనుకున్నాను. అయితే... మా అమ్మ నాతో ఓ సినిమా నిర్మించాలి అనుకున్నాను అని చెప్పింది. అందుకనే అమ్మ కోరిక మేరకు కొణిదెల ప్రొడక్షన్ ప్రారంభించాను.
మా బ్యానర్ లో నాన్న గారు ఫస్ట్ హీరో అవ్వడం పూర్వ జన్మసుకృతం. మా వినాయక్ గారితో పని చేసిన తర్వాత వేరే డైరెక్టర్స్ తో చేయడం కష్టం అంటారు. అంతలా కూల్ గా చూసుకుంటారు. ఫస్ట్ టైమ్ నేను బ్రూస్ లీ సినిమా జరిగేటప్పుడు తిరుపతి ప్రసాద్ గారు తని ఓరువన్ డివిడి ఇచ్చి చూడమన్నారు. చూసాను చాలా నచ్చింది. అదే ధృవ. రేసుగుర్రం తర్వాత సురేందర్ రెడ్డి గారిని సినిమా చేయమని అడిగాను. కేవలం నేను అడిగాను అని రీమేక్ చేయడానికి ఓకే చెప్పిన సురేందర్ రెడ్డిగార్కి థ్యాంక్స్ అన్నారు.
డైరెక్టర్ వినాయక్ మాట్లాడుతూ... చిరంజీవి గారి 61 పుట్టినరోజు అంటున్నారు కాదు 21వ జన్మదినం. సినిమా చూసిన తర్వాత అందరూ ఆయన వయసు 61 కాదు 21 అని చెబుతారు. చాలా యంగ్ గా అత్యధ్భుతంగా ఉన్నారు. ఒక అభిమానిగా ఏమైతే కోరుకంటారో అవన్నీ ఈ సినిమాలో ఉంటాయ్. ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. అభిమానులు కోసం ఖైదీ నెం 150వ చిత్రంలో ఓ డైలాగ్ చెబుతున్నాను ఓ సీన్ లో చిరంజీవి గారు... ఓరేయ్ పొగరు నా ఓంట్లో ఉంటది... హీరోయిజం నా ఇంట్లో ఉంటది. ఈ చిత్రంలో ఇలాంటి డైలాగ్స్ ఎన్నో ఉన్నాయి అన్నారు.