చిరు 152 రిలీజ్ ప్లానింగ్ మారిందా?
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి 152వ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. కొరటాల శివ ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ముందస్తు కార్యక్రమాలు చక చకా జరుగుతున్నాయి. డిసెంబర్‌లో సినిమా సెట్స్ పైకి వెళుతుందని వార్తలు వినపడుతున్నాయి. కాగా.. ఈ సినిమాను ముందుగా వచ్చే ఏడాది సమ్మర్‌లో విడుదల చేద్దామని చిత్ర యూనిట్ భావించిందట.
కానీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా సినిమాను ఆగస్ట్ 14న విడుదల చేయబోతున్నారట. ఆగస్ట్ 15తో పాటు.. వీకెండ్ కూడా కలిసి వచ్చేలా ఉండటంత నిర్మాతలకు ఇదే బెస్ట్ రిలీజ్ డేట్ అనుకున్నారట. చిరంజీవి కూడా అదే రోజు అయితే కమర్షియల్‌గా కూడా సినిమాకు వర్కవుట్ అవుతుందని ఓకే చెప్పాడని టాక్.
ఈ చిత్రాన్ని నిరంజన్ రెడ్డి, రామ్‌చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రీసెంట్‌గా స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ `సైరా నరసింహారెడ్డి` విడుదలై మంచి టాక్‌ను సంపాదించుకుంది. అంతకు ముందు చిరంజీవి `ఖైదీ నంబర్ 150` సినిమాతో బ్లాక్‌బస్టర్‌ను సాధించాడు. ఇప్పుడు మెసేజ్ ఓరియెంటెడ్ కమర్షియల్ చిత్రాలను తెరకెక్కించడంలో దిట్ట అయిన కొరటాల శివ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో త్రిష హీరోయిన్‌గా నటిస్తుందని టాక్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com