చిరు 151వ సినిమా ఫిక్స్...
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాకి కత్తి రీమేక్ ను ఫైనల్ చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి డైరెక్టర్ వినాయక్. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి నిర్మాతలు తనయుడు చరణ్, సతీమణి సురేఖ అని చిరు బ్రూస్ లీ ఆడియో వేడుకలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి పూర్తి వివరాలను 15 రోజుల్లో తెలియచేస్తామని చిరు చెప్పారు. ఇక అసలు విషయానికి వస్తే...
చిరుని 150వ సినిమా తర్వాత 151వ సినిమా తనకే చేయాలని నిర్మాత అల్లు అరవింద్ అడగడం..చిరంజీవి కూడా ఓకె అనడం జరిగిందట. ఈ విషయాన్ని అల్లు అరవిందే బ్రూస్ లీ ఆడియో వేడుకలో చెప్పారు. ఇక డైరెక్టర్ విషయానికి వస్తే...పూరి జగన్నాథ్ చిరుతో 150వ సినిమా చేయాలనుకున్నారు. ఒకవేళ 150వ సినిమా కుదరకపోతే 151వ సినిమా నేనే చేస్తానని అంటున్నారు. మరి....అన్నీ అనుకున్నట్టే జరిగితే...మెగాస్టార్ 151వ సినిమాకి అల్లు అరవింద్ నిర్మాత. పూరి జగన్నాధ్ డైరెక్టర్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout