చిరు 151, 152 రెడీ..!
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 150వ చిత్రం ఖైదీ నెం 150. డైనమిక్ డైరెక్టర్ వి.వి.వినాయక్ తెరకెక్కిస్తున్న ఖైదీ నెం 150 చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. ఓ వైపు 150వ చిత్రం రిలీజ్ కి రెడీ అవుతుంటే....మరో వైపు చిరు నటించనున్న 151, 152 చిత్రాల స్టోరీస్ రెడీ అవుతుండడం విశేషం. మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ లో చేయనున్నారు. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ నిర్మించే ఈ భారీ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించనున్నట్టు సమాచారం.
సరైనోడు సినిమాతో మెగా కాంపౌండ్ లో ఎంట్రీ ఇచ్చిన బోయపాటి ఇటీవల చిరంజీవికి కథ చెప్పడం...కథ విని చిరు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందట. ఇక 152 సినిమా విషయానికి వస్తే...పూరి జగన్నాథ్ ఆటోజానీ అనే టైటిల్ తో చిరంజీవికి గతంలో ఓ కథ చెప్పారు. ఈ కథకు ప్రస్తుతం మార్పులు చేస్తున్నారట. 152వ చిత్రం పూరితో ఉంటుంది అని ప్రచారం జరుగుతుంది. ఈవిధంగా 150 వ చిత్రం సెట్స్ పై ఉండగానే 151, 152 చిత్రాలకు రెడీ అవుతున్నారు మెగాస్టార్..!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com