చిరు 151 & 152 మూవీస్ ఫిక్స్
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాగా కత్తి రీమేక్ చేయనున్నట్టు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వం వహించనున్నట్టు ప్రచారం జరుగుతుంది. అయితే చిరు 150వ సినిమా గురించి చరణ్ ని అడిగితే...కత్తి సినిమా నాన్న గారికి నచ్చింది. 150వ సినిమాగా కత్తి రీమేక్ చేస్తారా..? లేక వేరే కథతో చేస్తారా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. దసరా లోపు నాన్నగారు 150వ సినిమా గురించి పూర్తి వివరాలు ప్రకటిస్తారు.
అందరి అంచనాలకు తగ్గట్టుగా ఉండాలని 150వ సినిమా విషయంలో ఎంతో జాగ్రత్త తీసుకుంటున్నాం. నాన్నగారు నటించే 151, 152 సినిమాలకు కథలు సిద్దంగానే ఉన్నాయి. డైరెక్టర్స్ శ్రీను వైట్ల, వి.వి.వినాయక్ రెడీగా ఉన్నారని చెప్పారు. చరణ్ చెప్పిన ప్రకారం చూస్తే...చిరు 151 లేక 152 సినిమాకి శ్రీను వైట్ల డైరెక్టర్ అనేది కన్ ఫర్మ్. అయితే చిరు 150వ సినిమా పూర్తి వివరాలు తెలియాలంటే మరో వారం రోజులు ఆగాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com