చిరు150వ సినిమాకి కొత్త ముహుర్తం...

  • IndiaGlitz, [Monday,December 07 2015]

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా గురించి గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తూనే..ఉన్నాయి. ద‌స‌రా కి 150వ సినిమా గురించి పూర్తి వివ‌రాలు ప్ర‌క‌టిస్తామ‌ని స్వ‌యంగా చిరంజీవి ప్ర‌క‌టించారు. ద‌స‌రా..దీపావ‌ళీ వ‌చ్చాయి..వెళ్లిపోయాయి. కానీ చిరు 150వ సినిమా ప్ర‌క‌ట‌న మాత్రం రాలేదు. క‌త్తి రీమేక్ చేస్తున్న‌ట్టు ప్ర‌చారం జ‌రిగింది. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు క్లారిటీ లేదు. వినాయ‌క్ డైరెక్ట‌ర్ క‌న్ ఫ‌ర్మ్ అన్నారు. అయితే అఖిల్ సినిమా ప్లాప్ అవ్వ‌డంతో వినాయ‌క్ పేరు ఆలోచ‌న‌లో ప‌డింది.

ఇక ఇప్పుడు ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌కు త‌గ్గ‌ట్టు మంచి స్ర్కిప్ట్ కోసం మ‌ళ్లీ అన్వేష‌ణ ప్రారంభించార‌ట‌. కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ పై నిర్మించే ఈ ప్ర‌తిష్టాత్మ‌క చిత్రానికి చ‌ర‌ణ్ నిర్మాత‌. ప్ర‌స్తుతం సీరియ‌స్ గా చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. తాజా స‌మాచారం ప్ర‌కారం సంక్రాంతికి చిరు 150వ సినిమా పై ప్ర‌క‌ట‌న ఉండొచ్చు అంటున్నారు. ద‌స‌రాకి ప్ర‌క‌టిస్తామ‌న్నారు...దీపావ‌ళీ కూడా వెళ్లిపోయింది. మ‌రి సంక్రాంతికి అయినా ప్ర‌క‌టిస్తారో లేదో చూడాలి.