చిరు మూవీ లేటెస్ట్ అప్ డేట్..
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రాన్ని వి.వి.వినాయక్ దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. తమిళ్ లో ఘన విజయం సాధించిన కత్తి సినిమాని చిరు 150వ సినిమాగా రీమేక్ చేస్తున్నారు. గత కొన్నిరోజులుగా వినాయక్ ఈ సినిమాకి సంబంధించి స్ర్కిప్ట్ వర్క్ లో బిజీగా ఉన్నారు.
ఇక ఈ మూవీ లేటెస్ట్ అప్ డేట్ ఏమిటంటే....ఇటీవల చిరంజీవికి వినాయక్ ఫుల్ స్ర్కిప్ట్ వినిపించారట. కథ విని చిరు చాలా బాగుంది అంటూ వినాయక్ ని హగ్ చేసుకుని అభినందించారట. ఈ మూవీ కోసం రామ్ చరణ్ జూబ్లీ హిల్స్ లో ఆఫీస్ కూడా తీసారని సమాచారం. ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని సమ్మర్ తర్వాత ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నారు. మరి..కత్తి రీమేక్ తో చిరు ఎలాంటి విజయాన్ని సాధిస్తాడో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com