చిరు 150వ చిత్రం ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 150వ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. వి.వి.వినాయక్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుంది. తమిళ బ్లాక్ బష్టర్ కత్తి చిత్రానికి రీమేక్ గా చిరు 150వ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ ప్రతిష్టాత్మక చిత్రం గురించి లేటెస్ట్ అప్ డేట్ ఏమిటంటే....ఈనెల 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు. అభిమానులకు పండుగ రోజు. ఈ సందర్భంగా చిరంజీవి పుట్టినరోజు నాడు చిరు 150వ చిత్రం టైటిల్ & ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. ఈ విషయాన్ని అల్లు శిరీష్ ట్విట్టర్ ద్వారా తెలియచేసారు. సో...ఈనెల 22న చిరు ఫ్యాన్స్ కి పండగే పండగ..!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments