చిరు 150వ సినిమా కొత్త టైటిల్ ఇదే

  • IndiaGlitz, [Thursday,July 21 2016]

మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న 150వ చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఈ చిత్రాన్ని వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌కత్వంలో రామ్ చ‌ర‌ణ్ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి క‌త్తిలాంటోడు అనే టైటిల్ ఫిక్స్ చేసారంటూ ప్ర‌చారం జ‌రిగింది. అయితే..ఇటీవ‌ల రామ్ చ‌ర‌ణ్ ఫేస్ బుక్ లో నిర్వ‌హించిన వీడియో చాట్ లో నాన్న గారి 150వ చిత్రానికి టైటిల్ ఇంకా ఫిక్స్ చేయ‌లేదు. క‌త్తిలాంటోడు టైటిల్ కాదు అని చెప్పారు. దీంతో చిరు 150వ చిత్రానికి ఏ టైటిల్ పెడ‌తారు అనే ఆస‌క్తి రోజురోజుకి పెరుగుతుంది.

తాజాగా చిరు 150వ చిత్రానికి ఖైదీ నెంబ‌ర్ 150 అనే టైటిల్ పెడితే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తున్నార‌ట‌. ఎందుకంటే.... ఈ చిత్రంలో చిరంజీవి జైలులో ఖైదీగా ఉన్న‌ప్పుడు అత‌ని నెంబ‌ర్ 150. ఇటీవ‌ల చిరు జైలులో ఉన్న స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించారు. దీనికి తోడు చిరంజీవి న‌టించిన ఖైదీ నెంబ‌ర్ 786 చిత్రం ఘ‌న విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. అందుచేత సెంటిమెంట్ గా కూడా బాగుంటుంది అని ఆలోచిస్తున్నార‌ట‌. మ‌రి... చిరు 150వ చిత్రానికి టైటిల్ ఖైదీ నెంబ‌ర్ 150 ఫిక్స్ చేస్తారా..? మ‌రో టైటిల్ పెడ‌తారా.? అనేది ఆగ‌ష్టులో తెలుస్తుంది.