చిరు 150వ మూవీ గురించి ఇంట్రస్టింగ్ న్యూస్..
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ఇటీవల ప్రారంభమైన విషయం తెలిసిందే. వినాయక్ దర్శకత్వంలో రామ్ చరణ్ ఈ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి యువ సంగీత సంచలనం దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇటీవల మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్ చేసినట్టు దేవిశ్రీ ప్రసాద్ ట్విట్టర్ ద్వారా తెలియచేసారు.
ఇప్పుడు ఈ ప్రతిష్టాత్మక చిత్రం గురించి మరో ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అది ఏమిటంటే..ఇప్పటి వరకు ఫస్ట్ షెడ్యూల్ ఎప్పుడు ప్రారంభిస్తారనేది ప్రకటించలేదు. కానీ..ఇప్పుడు ఆ న్యూస్ బయటకు వచ్చింది. జూన్ 6 నుంచి ఈ భారీ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించనున్నారట. అలాగే చిరు సరసన అనుష్క నటించడం ఖాయం అని ఫిల్మ్ నగర్ సమాచారం. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com