చిరు మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యేది అప్పుడే..
- IndiaGlitz, [Tuesday,June 21 2016]
మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించడానికి రంగం సిద్దమైంది. ఈ భారీ చిత్రాన్ని సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మిస్తుస్తున్న విషయం తెలిసిందే.ఈ భారీ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ను ఈ నెల 23 నుంచి ప్రారంభించనున్నారు. ఫస్ట్ డే షూటింగ్ చిరంజీవి పై చిత్రీకరించనున్నారు. రామోజీ ఫిలింసిటీలో ఫస్ట్ డే షూటింగ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. రెండో రోజు షూటింగ్ ను ఈనెల 24న హైటెక్ సిటీ ఫ్లైఓవర్ పై ప్లాన్ చేసారట.
అయితే..చిరు సరసన నటించే హీరోయిన్ ఎవరనేది ఇంకా కన్ ఫర్మ్ కాలేదు. ఠాగూర్ తర్వాత చిరు, వినాయక్ కలిసి చేస్తున్న సినిమా కావడం...పైగా చిరు 150వ చిత్రం కావడంతో ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీనికి తోడు ఇటీవల జరిగిన మాటీవీ అవార్డ్స్ ఫంక్షన్ లో చిరు స్టేజ్ పై డ్యాన్స్ అదరగొట్టేయడంతో ఈ ప్రతిష్టాత్మక చిత్రం పై రోజురోజుకు ఎక్స్ పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి. ఈ క్రేజీ మూవీని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నారు.