Chinthamaneni:తగ్గని చింతమనేని బలుపు.. గొర్రెల కాపరిపై దాడి..
Send us your feedback to audioarticles@vaarta.com
ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అహంకారంతో అనేక అరాచకాలు చేశారు. దీంతో జనం ఛీకొట్టి మూలన కూర్చోబెట్టారు. దానికి తోడు పాతకేసుల్లో అరెస్ట్ అయి జైలుకు వెళ్లొచ్చారు. అయినా కానీ బలుపు తగ్గలేదు. ఆయనే దెందులూరు టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్. వెనుకబడిన వర్గాలు, తన కన్నా కింది స్థాయి వాళ్లు కనిపిస్తే చాలు దాడులు చేయడం, అవమానించడం పరిపాటిగా మారింది. ఒరేయ్ మీ ఎస్సీలకు ఎన్నికలు.. రాజకీయాలు ఎందుకురా... మేము రాజకీయాలు చేస్తాం.. మీరు జస్ట్ ఓట్లు వేయండి చాలు అని బహిరంగ సభలో అహంకారపూరితంగా మాట్లాడిన చింతమనేని ఇంకా అదే బలుపుతో విర్రవీగుతూ ఉన్నారు.
నిబంధనలకు విరుద్ధంగా అటవీ భూముల్లో రోడ్లు వేస్తున్నందుకు అడ్డుకున్నారని అటవీ సిబ్బందిని కొట్టడంతో పాటు ఇసుక దందాను ఆపినందుకు ఎమ్మార్వోను కొట్టిన చింతమనేని ఇంకా అదే పొగరు.. బలుపు చూపుతూ అందర్నీ భయపెడుతున్నారు. తాజాగా పెదవేగి మండలం, రామచంద్రాపురం అడ్డరోడ్డు దగ్గర వీరంకి లక్ష్మీనారాయణ అనే గొర్రెల కాపరిపై చింతమనేని దాడి చేశారు. తన జీడి మొక్కల దగ్గరకి గొర్రెలు వెళ్లాయంటూ ఆ కాపరిని తిడుతూ కింద పడేసి గుండెల మీద తన్నడమే కాకుండా అతని గొర్రెలను దౌర్జన్యంగా తన కార్లో ఎక్కించుకుని వెళ్లిపోయారు. దీంతో చింతమనేని దౌర్జన్యంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎవడొస్తాడో చూస్తానని, ఎవడికి చెప్పుకుంటావో, చెప్పుకోమంటూ చింతమనేని బెదిరించాడని ఈ సంఘటనకు అక్కడే ఉన్న టీడీపీ కార్యకర్తలే సాక్ష్యమని తన బాధ వెల్లబోసుకున్నాడు.
ఈ సంఘటన తెలిసిన వెంటనే దెందులూరు నియోజకవర్గం గౌడ సంఘం అధ్యక్షుడు మట్టా శంకర్ గారి ఆధ్వర్యంలో ప్రజలు రామచంద్రాపురం అడ్డరోడ్డుకు చేరుకొని చింతమనేని కారును అడ్డగించి నిలదీశారు. తాను కొట్టలేదని చెబుతూ మెల్లగా అక్కడి నుంచి జారుకున్నారు. ఈ వ్యవహారం మొత్తం తెలిసిన ప్రజలు ఓడిపోయినా చింతమనేనికి ఇంకా బలుపు తగ్గలేదని.. ఈ ఎన్నికల్లో కూడా ఓడిస్తే తప్ప పొగరు కిందికి దిగదని మండిపడుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments