అభిమానులతో మాట్లాడి పార్టీ మారుతా: చింతమనేని
Send us your feedback to audioarticles@vaarta.com
దెందలూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దళితులపై చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల యావత్ రాష్ట్ర వ్యాప్తంగా దళిత సంఘాలు, విద్యా్ర్థి విభాగాలు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. తక్షణమే చింతమనేని తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని మరోవైపు ప్రజా సంఘాలు సైతం డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో చింతమనేని ప్రభాకర్‌ను అరెస్టు చేయాలని ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ-వైసీపీగా వివాదం ముదిరింది. జిల్లాలో టీడీపీ, వైసీపీ కార్యకర్తలు పోటాపోటీగా ఆందోళనలు చేపట్టారు.
ఈ వ్యవహారంపై ఎట్టకేలకూ స్పందించడానికి మీడియా ముందుకొచ్చిన చింతమనేని.. సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం జరుగుతోందని మొసలి కన్నీరు కార్చారు!. " నా వల్ల టీడీపీకి చెడ్డ పేరు వస్తే పార్టీ నుంచి వైదొలుగుతాను. నా అభిమానులు, పార్టీ శ్రేణులతో చర్చించి పార్టీని వీడే నిర్ణయం తీసుకుంటాను. అభిమానులతో చర్చించిన తర్వాత పార్టీలో ఉండాలా లేదా మారాలా అనేది నిర్ణయిస్తాను. దళితుల పక్షపాతి అయిన నన్ను.. దళిత వ్యతిరేకిగా చిత్రీకరిస్తున్నారు" అని చింతమనేని చెప్పుకొచ్చారు.
అయితే.. తెలుగు తమ్ముళ్లు ఇలా దళితుల పట్ల వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కొత్తేమీ కాదు. సాక్ష్యాత్తూ సీఎం చంద్రబాబు కూడా దళితుల గురించి అనుచితంగా మాట్లాడిన సంగతి తెలిసిందే. అయితే తాజా ‘చింత’మనేని వ్యవహారంపై అధిష్టానం ఎలా స్పందిస్తుంది..? అవసరమైతే పార్టీని వీడతాను అంటున్న ఆయన ఏ పార్టీలోకి జంప్ అవుతారు..?అనే విషయాలపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout