క్షమాపణలు చెప్పి.. జగన్‌‌కు చింతమనేని సవాల్

  • IndiaGlitz, [Monday,February 25 2019]

పశ్చిమ గోదావరి జిల్లా దెందలూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఓ వీడియో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. ఆ వీడియో చూసిన ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు రాష్ట్రవ్యాప్తంగా నిరసలు, ఆందోళనలతో హోరెత్తించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై ఇప్పటికే గల్లీ నేతల నుంచి సీఎం చంద్రబాబు వరకు స్పందించారు. అదేదో సామెత ఉంది కదా.. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లుగా అయితే అంతా అయిపోయాక.. జరగాల్సింది జరిగిపోయాక.. చింతమనేని మీడియా ముందుకొచ్చి అసలేం జరిగింది..? ఆ వీడియో నిజమా..అబద్ధమా..? అనే విషయాలపై క్లారిటీ ఇచ్చుకున్నారు.

తప్పుగా అర్థం చేస్కోవద్దు.. క్షమించండి!

ఎస్సీలకు, తనకు మధ్య అగాధం సృష్టించాలని వైఎస్ జగన్ చూస్తున్నారు. గతంలో తన ప్రసంగానికి సంబంధించిన ఓ వీడియోలో దళితులపై నేను అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నట్టుగా ఎడిట్ చేసి పోస్ట్ చేశారు. నా మాటలను వక్రీకరించారు. కొంత మంది వ్యక్తులకు మద్యం సరఫరా చేసి నా మీటింగ్‌ని అపఖ్యాతిపాలు చేసేందుకు వాళ్లను అడ్డుపడమని వైసీపీ పురమాయించింది. వాళ్లను మందలిస్తున్న సందర్భంలో నేను ఎక్కడా కూడా తప్పుగా మాట్లాడలేదు. రెండు నిమిషాల ముప్పై సెకండ్లు ఉన్నటువంటి వీడియోను ఎడిట్ చేసి 30 సెకండ్లు చూపించేలా చేశారు. నా వ్యాఖ్యలు మిమ్మల్ని బాధించు ఉన్నా.. ఒకవేళ ఈ 30 సెకన్ల వీడియో చూసి ఎవరైనా బాధపడి ఉంటే ఈ రాష్ట్ర ప్రజానీకానికి, ఎస్సీ సంఘాల వారికి, పౌరులకు నేను క్షమాపణలు చెబుతున్నాను అని చింతమనేని ప్రెస్‌మీట్ పెట్టి చెప్పారు.

ఎవరు తవ్వుకున్న గోతిలో వాళ్లే పడతారు..!

తప్పు చేసింది వాళ్లయినా నాపై పెట్టారని, ప్రజాక్షేత్రంలో నన్ను దోషిగా నిలబెట్టారు కనుక వాళ్ల తరపున కూడా క్షమాపణలు చెబుతున్నాను. పూర్తి వీడియోను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చూడాలని కోరుతున్నాను. ఎవరు తవ్వుకున్న గోతిలో వారు పడతారు. దళితులపై నేను అనుచిత వ్యాఖ్యలు చేశానని నిరూపిస్తే కనుక రాజకీయాల నుంచి వైదొలుగుతాను. ఎమ్మెల్యే పదవి కోసం నేను రాజకీయాలు చేయడం లేదు. నన్ను ఎదుర్కొనేందుకు కుట్ర రాజకీయాలు చేయడం సరికాదు. రాజకీయ దివాళాకోరు తనానికి ఈ సంఘటనే నిదర్శనం అని ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు.

సాక్షి పత్రికపై ఫిర్యాదు చేస్తా...

అసత్య కథనాలు రాస్తున్న‘సాక్షి’ పత్రికపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేస్తాను. నన్ను దళిత వ్యతిరేకిగా ముద్రవేసి కుట్ర జరుగుతోంది. నేను దళిత పక్షపాతిని. కష్టంలో ఉన్నవారిని ఆదుకోవడమే నా కులం. నాకు కులాన్ని, మతాన్ని ఆపాదించడం ఎవరి తరం కాదు. నేను తప్పు చేస్తే ప్రజాకోర్టులో శిక్షపడుతుంది. నేనేంటో నా నియోజకవర్గ ప్రజలకు బాగా తెలుసు అని ఈ సందర్భంగా చింతమనేని స్పష్టం చేశారు.

జగన్, కేటీఆర్ గురించి...

జగన్ కు దమ్ముంటే దెందులూరులో పోటీ చేసి గెలవాలి. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి రాజకీయాలు చేస్తున్నారు. జగన్ సీఎం అవుతారని కేటీఆర్ అంటున్నారు. కేటీఆర్ పగటికలలు మానుకోవాలి. చిలక జోస్యాలు అవసరం లేదు అని కేటీర్ సెటైర్లు.. జగన్‌‌కు చింతమనేని సవాల్ విసిరారు. అయితే టీడీపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలకు టీఆర్ఎస్, వైసీపీల నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో వేచి చూడాల్సిందే మరి.

More News

టీడీపీ టార్గెట్ జగన్‌‌ కాదు.. ఆ ఆరుగురే!?

టైటిల్ చూడగానే ఆశ్చర్యపోతున్నారా..? అవును మీరు వింటున్నది నిజమే పులివెందులలో ఎలాగో గెలిచేది లేదు..

అలీ పనైపోయింది.. ఇక థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీనే!?

రాజకీయాల్లోకి రావాలన్న చిరకాల కోరిక తీర్చుకోవడానికి కమెడియన్ అలీ చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు.

వ‌న్ మెన్ ఆర్మీ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌..

సందీప్ చీలంను హీరోగా ప‌రిచ‌యం చేస్తూ అను ప్రొడక్షన్స్ & మ్యాజిక్ ఫ్రేమ్స్ ప్రొడ‌క్ష‌న్స్ సంయుక్తంగా కలిసి నిర్మిస్తున్న సినిమా వ‌న్ మెన్ ఆర్మీ.

'సైరా', 'కాటమరాయుడు' గురించి పవన్ ఏమన్నారంటే...

టైటిల్ చూడగానే తమ్ముడు 'కాటమరాయుడు' ఆల్రెడీ చూసేశాం.. ఇక మిగిలింది చిరంజీవి 'సైరా'నే కదా అని అనుకుంటున్నారా..? ఇది మీరు అనుకుంటున్నట్లుగా ఇద్దరు అన్నదమ్ముల సినిమాలు అస్సలు కానేకాదండోయ్

'జనసేన' లేనిదే తెలుగు రాష్ట్రాల రాజకీయాలుండవ్

ఆంధ్రప్రదేశ్‌‌లో ఎన్నికలకు మరికొన్ని రోజులే మిగిలుండటంతో జనసేనాని జోరు పెంచారు. ఇప్పటికే కోస్తాఆంధ్రలోని అన్ని జిల్లాల్లో బహిరంగ సభలు, ఆత్మీయుల సమావేశాలు పెట్టి జనసైన్యం