చిరు 150వ చిత్రం పై చిన్నికృష్ణ సంచలన వ్యాఖ్యలు..
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం గురించి చాలా కథలు విని ఫైనల్ గా తమిళ చిత్రం కత్తి రీమేక్ చేయడమే కరెక్ట్ అనుకుని సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.అయితే... చిరంజీవి 150వ చిత్రం కోసం రైటర్ చిన్నికృష్ణ ఓ కథ రెడీ చేసారు. కానీ...ఎందుకనో ఆ కథ చిరంజీవికి నచ్చలేదు.
చిన్నికృష్ణ ఇటీవల ఇచ్చిన ఇంటర్ వ్యూలో చిరు 150వ చిత్రం గురించి స్పందిస్తూ....నేను చిరంజీవి గారి 150వ చిత్రం కోసం కథ రెడీ చేసాను. నా జడ్జిమెంట్ ఇప్పటి వరకు ఎప్పుడూ తప్పలేదు. కానీ...నేను రెడీ చేసిన ఆ కథ చిరంజీవి గారికి నచ్చలేదు. అది ఆయన వ్యక్తిగత నిర్ణయం. ఇక చిరంజీవి గారి 150వ చిత్రం తమిళ కత్తి రీమేక్. కనుక ఆల్ మోస్ట్ జిరాక్స్ కాపీ లాంటిది. ఇక బాలయ్య 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి చరిత్రను చెప్పే సినిమా.రెండు స్ట్రైయిట్ మూవీస్ అయితే మాట్లాడచ్చు. స్ట్రైయిట్ మూవీస్ కావు కాబట్టి రెండు చిత్రాలను పొల్చలేం అంటూ తన మనసులో మాటలు బయటపెట్టారు రైటర్ చిన్నికృష్ణ.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com