చిరు 150వ చిత్రం పై చిన్నికృష్ణ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

  • IndiaGlitz, [Monday,July 18 2016]

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం గురించి చాలా క‌థ‌లు విని ఫైన‌ల్ గా త‌మిళ చిత్రం క‌త్తి రీమేక్ చేయ‌డమే కరెక్ట్ అనుకుని సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే.అయితే... చిరంజీవి 150వ చిత్రం కోసం రైట‌ర్ చిన్నికృష్ణ ఓ క‌థ రెడీ చేసారు. కానీ...ఎందుక‌నో ఆ క‌థ చిరంజీవికి న‌చ్చ‌లేదు.

చిన్నికృష్ణ ఇటీవ‌ల ఇచ్చిన ఇంట‌ర్ వ్యూలో చిరు 150వ చిత్రం గురించి స్పందిస్తూ....నేను చిరంజీవి గారి 150వ చిత్రం కోసం క‌థ రెడీ చేసాను. నా జ‌డ్జిమెంట్ ఇప్ప‌టి వ‌ర‌కు ఎప్పుడూ త‌ప్ప‌లేదు. కానీ...నేను రెడీ చేసిన ఆ క‌థ చిరంజీవి గారికి న‌చ్చ‌లేదు. అది ఆయ‌న వ్య‌క్తిగ‌త నిర్ణ‌యం. ఇక చిరంజీవి గారి 150వ చిత్రం త‌మిళ క‌త్తి రీమేక్. క‌నుక ఆల్ మోస్ట్ జిరాక్స్ కాపీ లాంటిది. ఇక బాల‌య్య 100వ చిత్రం గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి చ‌రిత్ర‌ను చెప్పే సినిమా.రెండు స్ట్రైయిట్ మూవీస్ అయితే మాట్లాడ‌చ్చు. స్ట్రైయిట్ మూవీస్ కావు కాబ‌ట్టి రెండు చిత్రాల‌ను పొల్చ‌లేం అంటూ త‌న మ‌న‌సులో మాట‌లు బ‌య‌ట‌పెట్టారు రైట‌ర్ చిన్నికృష్ణ‌.

More News

బాల‌య్య సినిమాకు చిరు స‌పోర్ట్‌....

నంద‌మూరి బాల‌కృష్ణ `ఆదిత్య 369` చిత్రం విడుద‌లై స‌రిగ్గా పాతికేళ్లైంది. విడుద‌లైన‌ప్పుడు సెన్సేష‌న‌ల్ హిట్ సాధించిన ఈ చిత్రం గురించి అప్పుడు అంద‌రూ గొప్ప‌గా మాట్లాడారు.

మెగా హీరో మూవీ టైటిల్ జ‌వాన్..

మెగాస్టార్ మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్ న‌టించిన సుప్రీమ్ స‌క్సెస్ సాధించ‌డంతో...త‌దుప‌రి చిత్రాలకు ప‌క్కా ప్లాన్ రెడీ చేసాడు. తేజు న‌టించిన త‌దుప‌రి చిత్రం తిక్క‌. ఈ చిత్రాన్నిఓమ్ ఫేమ్  సునీల్ రెడ్డి తెర‌కెక్కించారు.

ఆదిత్య 369 సీక్వెల్ గురించి ఇంట్ర‌స్టింగ్ న్యూస్..

నంద‌మూరి బాల‌కృష్ణ - సింగీతం శ్రీనివాస‌రావు కాంబినేష‌న్లో రూపొందిన సంచ‌ల‌న చిత్రం ఆదిత్య 369. విభిన్న క‌థాంశంతో రూపొందిన‌ ఆదిత్య 369 ప్రేక్ష‌కాభిమానులు ఆక‌ట్టుకుని తెలుగు నాట మ‌ర‌చిపోలేని చిత్రంగా నిలిచింది.

ప‌ద‌కొండేళ్ల త‌ర్వాత మ‌ళ్ళీ విల‌న్‌గానే

బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ స‌ల్మాన్‌ఖాన్ సోద‌రుడు అర్బాజ్ ఖాన్ 2005లో వ‌చ్చిన జై చిరంజీవ సినిమాలో విల‌న్‌గా న‌టించాడు. త‌ర్వాత మ‌ళ్ళీ టాలీవుడ్‌లో నటించ‌లేదు.

2016 నాకు బాగా క‌లిసి వ‌చ్చింది - నిర్మాత శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్‌

బాల‌కృష్ణ, మోహిని జంట‌గా సింగీతం శ్రీనివాస‌రావు ద‌ర్శ‌క‌త్వంలో శ్రీదేవి మూవీస్ బ్యాన‌ర్‌పై రూపొందిన చిత్రం `ఆదిత్య 369`. ఈ సినిమా 1991జూలై 18న విడుద‌లై ఘ‌న విజ‌యం సాధించ‌డ‌మే కాకుండా టైమ్ మిష‌న్‌పై వ‌చ్చిన సినిమాగా అప్ప‌ట్లో సెన్సేష‌న్ క్రియేట్ చేసింది.