చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే ఆడియో విడుదల

  • IndiaGlitz, [Thursday,August 04 2016]

ప‌వ‌న్, సోనియా దీప్తి హీరో, హీరోయిన్లుగా పి.ఆర్.మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ పై సంతోష్ నెలంటి ద‌ర్శ‌క‌త్వంలో సోని ప‌వ‌న్, ర‌జిని గ‌ట్టు నిర్మించిన చిత్రం చిన్ని చిన్ని ఆశ‌లు నాలో రేగెనే. ఈ చిత్రంలో మ‌ను మ‌రో హీరోగా న‌టించాడు. బి.సి సంఘం అధ్య‌క్షుడు ఆర్.కృష్ణ‌య్య ఆడియోను ఆవిష్క‌రించి తొలి సిడీని ప‌వ‌న్ కు అంద‌చేసారు.
ఈ సంద‌ర్భంగా హీరో ప‌వ‌న్ మాట్లాడుతూ...డైరెక్ట‌ర్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెర‌కెక్కించారు. ఈ చిత్రంలో నా క్యారెక్ట‌ర్ చాలా కొత్త‌గా ఉంటుంది. ప్రేక్ష‌కుల‌కు కావాల్సినంత వినోదం ఈ చిత్రంలో ఉంటుంది అన్నారు.
బి.సి. సంఘం అధ్య‌క్షులు ఆర్ .కృష్ణ‌య్య మాట్లాడుతూ...అంద‌రి దృష్టిని ఆక‌ర్షించే రంగం సినిమారంగం. ప్ర‌జ‌లంద‌రికీ ఎంట‌ర్ టైన్మెంట్ ఇస్తూ స‌మాజానికి సందేశాత్మ‌క చిత్రాలు చేస్తే బాగుంటుంది.ఇలాగే ఇప్ప‌టి కుర్రాళ్ల కూడా సందేశాత్మ‌క చిత్రాల వైపు అడుగులు వేయాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. ఈ చిత్రం మంచి విజ‌యం సాధించాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.
నిర్మాత ప్ర‌తాని రామ‌కృష్ణ గౌడ్ మాట్లాడుతూ...ఈ చిత్రంలో పాట‌లు బాగున్నాయి. ప‌వ‌న్ హీరోగా మంచి పేరు సాధించాలి. ఈ చిత్రం అంద‌ర్నీ ఆక‌ట్టుకుని చిత్ర నిర్మాత లాభాలు అందిస్తుంద‌ని ఆశిస్తున్నాను అన్నారు.