చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే ప్లాటినమ్ డిస్క్ వేడుక
Send us your feedback to audioarticles@vaarta.com
పి.ఆర్. మూవీ మేకర్స్ తెరకెక్కిస్తున్న సినిమా `చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే`. పవన్, గట్టు మను హీరోలుగా నటించారు. సోనియా దీప్తి హీరోయిన్. షకలక శంకర్, తాగుబోతు రమేశ్, బాషా, షానీ, పింగ్ పాంగ్, చిట్టిబాబు, చంద్రమౌళి, శ్రీనివాస్ కీలక పాత్రధారులు. సోనీ పవన్, గట్టు రజిని నిర్మాతలు. సంతోష్ నేలంటి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్లాటినమ్ డిస్క్ వేడుక హైదరాబాద్‌లో శుక్రవారం జరిగింది. సాగర్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, మల్కాపురం శివకుమార్, రామకృష్ణ గౌడ్, శివాజీరాజా, భోలే తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ ``టైటిల్ చాలా బావుంది. ట్రైలర్ కూడా నచ్చింది. హీరోలు చక్కగా చేశారు. సోనియా ఇప్పటికే నాలుగు హిట్లు ఇచ్చిన అమ్మాయి. తన గోల్డెన్ లెగ్ ఈ సినిమాకు ఉపయోగపడుతుంది. చిన్న సినిమాలకు థియేటర్లు దొరకడం లేదనే మాటలో వాస్తవం సగమే ఉంది. చిన్న సినిమాల కోసం నేను కూడా డిస్ట్రిబ్యూషన్ మొదలుపెట్టాను. చిన్న చిత్రాల వల్ల చాలా మంది బతుకుతారు`` అని అన్నారు.
మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ ``1970 నుంచి నల్గొండలో థియేటర్ ఉన్న కుటుంబం గట్టు కుటుంబం. ఈ సినిమా ప్లాటినమ్ డిస్క్ వేడుకను నిర్వహించుకోవడం ఆనందంగా ఉంది. ట్రైలర్ చూస్తే సినిమాలో కొత్తదనం ఉందనిపిస్తోంది. కొత్తవారిని ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది`` అని చెప్పారు.
సాగర్ మాట్లాడుతూ ``రొటీన్ పిక్చర్‌లాగా లేదు. కాన్సెప్ట్ బావుంటే ఇప్పుడు అన్ని చిత్రాలూ ఆడుతున్నాయి. ఇది కూడా తప్పకుండా పెద్ద సినిమా అవుతుంది`` అని అన్నారు.
సోనియా మాట్లాడుతూ ``ఇందులో మంచి పాట పాడాను. ఇకపై కూడా అవకాశం వస్తే తప్పకుండా పాడుతాను`` అని చెప్పారు.
శివాజీరాజా మాట్లాడుతూ ``చిత్ర చిత్రాలు లేకపోతే 24 క్రాఫ్ట్ లకు కష్టమవుతుంది. విడుదల సమయంలో ఎవరూ కంగారు పడొద్దు. తెలంగాణ ప్రభుత్వం కూడా చిన్న సినిమాలకోసం థియేటర్లను కేటాయిస్తోంది. హీరో కరెంట్ తీగలాగా సన్నగా ఉన్నాడు. పవర్ ఉన్న కుర్రాడు`` అని అన్నారు.
ప్రతాని రామకృష్ణగౌడ్ మాట్లాడుతూ ``సినిమా తప్పకుండా హిట్ అవుతుందనే నమ్మకం ఉంది. సోనియా పాడిన పాట బావుంది`` అని తెలిపారు.
దర్శకుడు మాట్లాడుతూ ``ఫీల్ గుడ్ చిత్రమిది. యువతకు కావాల్సిన మసాలా కూడా ఉంటుంది. 2016లో విడుదలై విజయం సాధించిన చిత్రాల్లో మా సినిమా కూడా ఉంటుందనే నమ్మకం ఉంది`` అని చెప్పారు.
నిర్మాత మాట్లాడుతూ ``మా అబ్బాయికి ఈ సినిమాలో అవకాశం వచ్చింది. అతని కోసం నిర్మాతగా మారాను. 1973 నుంచి మాకు నల్గొండలో థియేటర్ ఉంది. అతిథులు అందరూ మాట్లాడిన మాటలు వింటుంటే దాదాపు 150 థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేస్తామనే నమ్మకం కుదిరింది`` అని అన్నారు.
హీరో మాట్లాడుతూ ``మా పాటలకు మంచి స్పందన వచ్చింది. గత వారం రోజుల్లోనే మూడున్నర లక్షల క్లిక్కులు యూట్యూబ్‌లో పడ్డాయి`` అని అన్నారు.
సంగీత దర్శకుడు ర్యాప్ రాక్ షకీల్ మాట్లాడుతూ ``సినిమా బాగా వచ్చింది. సంగీతం చక్కగా కుదిరింది. పాటల కార్యక్రమం చేయడం ఆనందంగా ఉంది`` అని చెప్పారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments