'చినబాబు' టీజర్ కు అద్భుతమైన స్పందన
Send us your feedback to audioarticles@vaarta.com
హీరో కార్తీ నటించిన చినబాబు టీజర్ ను నిన్న సాయంత్రం కార్తీ అన్న తమిళ్ స్టార్ హీరో సూర్య విడుదల చెయ్యడం జరిగింది. టీజర్ కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన లభిస్తోంది. చినబాబు సినిమాలో రైతు పాత్రలో కార్తీ కనిపించబోతున్నాడు.
చినబాబు సినిమా టీజర్ చూస్తుంటే గ్రామీణ నేపథ్యంలో జరిగే ఒక రైతు గురించి సినిమా ఉండబోతోందని తెలుస్తోంది. చినబాబు టీజర్ లో కార్తీ డైలాగు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. "పుట్టించినవాడు దేవుడైతే... పండించిన వాడు కూడా దేవుడే" "నువ్వే రైతు అయితే కాలర్ ఎగరేసుకొని తిరుగు" అంటూ రైతుల గొప్పదనం గురించి దర్శకుడు పాండిరాజ్ రాసిన డైలాగ్స్ కు మంచి స్పందన లభిస్తోంది.
నటుడు సత్యరాజ్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు. డి.ఇమాన్ సంగీతం అందిస్తున్న చినబాబు సినిమాను తమిళ్ స్టార్ హీరో సూర్య తో కలిసి నిర్మాత మిరియాల రవీందర్ రెడ్డి ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com