'చినబాబు' టీజర్ కు అద్భుతమైన స్పందన

  • IndiaGlitz, [Monday,June 04 2018]

హీరో కార్తీ నటించిన చినబాబు టీజర్ ను నిన్న సాయంత్రం కార్తీ అన్న తమిళ్ స్టార్ హీరో సూర్య విడుదల చెయ్యడం జరిగింది. టీజర్ కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన లభిస్తోంది. చినబాబు సినిమాలో రైతు పాత్రలో కార్తీ కనిపించబోతున్నాడు.

చినబాబు సినిమా టీజర్ చూస్తుంటే గ్రామీణ నేపథ్యంలో జరిగే ఒక రైతు గురించి సినిమా ఉండబోతోందని తెలుస్తోంది. చినబాబు టీజర్ లో కార్తీ డైలాగు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. పుట్టించినవాడు దేవుడైతే... పండించిన వాడు కూడా దేవుడే నువ్వే రైతు అయితే కాలర్ ఎగరేసుకొని తిరుగు అంటూ రైతుల గొప్పదనం గురించి దర్శకుడు పాండిరాజ్ రాసిన డైలాగ్స్ కు మంచి స్పందన లభిస్తోంది.

నటుడు సత్యరాజ్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు. డి.ఇమాన్ సంగీతం అందిస్తున్న చినబాబు సినిమాను తమిళ్ స్టార్ హీరో సూర్య తో కలిసి నిర్మాత మిరియాల రవీందర్ రెడ్డి ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.

More News

సెకండ్ షెడ్యూల్లో రానా చిత్రం .. టైటిల్ ఏంటంటే...?

కెరీర్ ప్రారంభం నుండి విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌లు, వైవిధ్య‌మైన క‌థాంశాలున్న చిత్రాల్లో న‌టించ‌డానికి ఆస‌క్తి చూపుతున్న యువ క‌థానాయ‌కుడు రానా ద‌గ్గుబాటి.

క్రీడాకారిణి బయోపిక్ ప్లాన్ చేస్తున్న మ‌హిళా డైరెక్ట‌ర్‌

తెలుగు ప్రేక్షకులకి బయోపిక్‌లు కొత్తేమీ కాదు. కాకపోతే.. చాలా కాలం గ్యాప్ తర్వాత తెలుగు ప్రేక్షకుల అభిమాన నటి సావిత్రిపై  ‘మహానటి’ రూపంలో  బయోపిక్ విడుదల కావడంతో..

'పందెం కోడి' త‌ర్వాత విశాల్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ 'అభిమ‌న్యుడు' - నిర్మాత గుజ్జ‌ల పూడి హ‌రి

300 సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసి...స‌క్సెస్‌ఫుల్ డిస్ట్రిబ్యూట‌ర్‌గా పేరు తెచ్చుకున్నారు గుజ్జ‌ల‌పూడి హ‌రి. హీరో విశాల్‌తో మంచి అనుబంధాన్ని కొనసాగిస్తూ ఆయ‌న హీరోగా న‌టించిన రాయుడు

జులై 5న విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న‌ 'RX 100'

మా 'RX 100' టీజ‌ర్‌కి యూట్యూబ్‌లో ఆరు ల‌క్ష‌ల ఆర్గానిక్ వ్యూస్ వ‌చ్చాయి

తెలుగు ద‌ర్శ‌కుల‌తో హిందీ చిత్రాలు

‘మనసుకు నచ్చింది’,  ‘రాజుగాడు’ చిత్రాల‌తో తెలుగు వారిని ప‌ల‌క‌రించిన ఉత్త‌రాది భామ అమైరా ద‌స్తూర్‌.