కొత్త వ్యాపారంలోకి చిన్మయి...
- IndiaGlitz, [Friday,March 22 2019]
సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్న చిన్మయి మీ టూ ఉద్యమంలో చురుకైన పాత్రను పోషించారు. ప్రముఖ తమిళ రచయిత వైరముత్తు, సీనియర్ నటుడు, డబ్బింగ్ యూనియన్ ప్రెసిడెంట్ రాధారవిపై లైంగిక వేధింపుల ఆరోపణలు కూడా చేసి వార్తల్లో నిలిచారు.
ఈమె సినిమాలతో పాటు కొత్త వ్యాపారం రంగంలోకి అడుగు పెడుతున్నారట. కాస్మోటిక్ వ్యాపారంలోకి చిన్మయి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఐసెల్ ఆఫ్ ద స్కిన్ అనే పేరుతో ఆమె కాస్మెటిక్ బ్రాండ్‌ను ఆమె ఇంట్రడ్యూస్ చేస్తున్నారు.
త్వరలోనే ఈ ప్రాడెక్ట్స్ కు సంబంధించి అధికారిక ప్రకటన ఉంటుందని వినికిడి. ఈమె భర్త రాహుల్ రవీంద్రన్ నటుడిగా రాణించారు. ఇప్పుడు మన్మథుడు 2 సినిమాను డైరెక్ట్ చేయబోతున్నారు.