అందుకే మగాళ్ల చూపు వాటిపై ఉంటుందా? : చిన్మయి

  • IndiaGlitz, [Monday,November 25 2019]

సినిమా ఇండస్ట్రీలో మహిళలపై ఎదుర్కొంటున్న లైంగిక సమస్యలపై మీటూ ఉద్యమం ప్రారంభమైన సంగతి తెలిసిందే. బాలీవుడ్‌, సౌత్‌ సినిమాల్లో పలువురిపై మీటూ ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు ఈ ఆరోపణలు అంతగా రావడం లేదు. ఈ విషయాన్ని పక్కన పెడితే.. దక్షిణాదిన మాత్రం సింగర్‌ చిన్మయి మహిళలపై జరుగుతున్న లైంగిక దాడుల గురించి స్పందిస్తూనే ఉంది. తాజాగా ఓ స్విగ్గీ డెలివరీ బాయ్‌ పిజ్జాను డెలివరీ చేయడానికి వెళ్లాడు. అక్కడ మహిళను చూసి పైన చున్నీ వేసుకోండి అని చెప్పాడు. దాంతో ఆ మహిళ స్విగ్గీ బాయ్‌పై సోషల్‌మీడియా వేదికగా తన అగ్రహాన్ని వ్యక్తం చేసింది.

నేను ఇంట్లో ఎలా ఉండాలో చెప్పడానికి వాడెవడు? నేనెలా ఉంటే వాడికేంటి? ఇతరులతో ఎలా నడుచుకోవాలనే విషయాన్ని కూడా మేమే స్విగ్గీ బాయ్స్‌కు నేర్పించాలా? అంటూ ఆమె స్విగ్గీ బాయ్‌ ప్రవర్తనను దయ్యబట్టింది. ఆమె చేసిన ట్వీట్‌కు కొందరి మద్దతు లభిస్తే మరికొందరు ఎగతాళి చేశారు. ఎగతాళి చేసిన వారందరినీ తాను బ్లాక్‌ చేస్తానని కూడా సదరు మహిళ చెప్పింది. ఈ ట్వీట్‌పై మహిళకు చిన్మయి తన మద్దతుని తెలిపింది. మహిళల వక్షోజాలను చూసే మగాళ్లను చూస్తే నాకు వారు చిన్నప్పుడు వారు తల్లి వద్ద పాలు తాగి ఉండనిపిస్తుంది. ఓ మహిళ చున్నీతో కప్పుకోకపోతే రేప్స్‌ జరుగుతాయనుకుంటారు అంటూ చిన్మయి మహిళలకు మద్దతుగా చిన్నయి ట్వీట్‌ చేసింది. అయితే ట్విట్టర్‌లో కొంత మంది డెలివరీ బాయ్‌కు మద్దతుని తెలిపారు.

More News

అప్పుడు గుండె పగిలేలా ఏడ్చాను: సమంత

పెళ్లి తర్వాత కూడా డిఫరెంట్‌ పాత్రల్లో నటిస్తూ నటిగా మంచి క్రేజ్‌ను, విజయాలను సొంతం చేసుకుంటుంది సమంత.

రాజ్ భవన్ మెజార్టీ నిర్ణయించలేదు... ఫడ్నవీస్ అసెంబ్లీలో బలపరీక్ష నిరూపించుకోవాల్సిందే : సుప్రీం

మహారాష్ట్ర సంక్షోభం పై సుప్రీం కోర్టులో వాదనలు ముగిశాయి. బలపరీక్షపై వాదనలు విన్న కోర్టు ... మంగళవారం ఉ.10.30 గంటలకు తీర్పును వెలువరించనుంది.

కృష్ణవంశీ షురూ చేశాడు...

విలక్షణ దర్శకుడిగా పేరున్న క్రియేటివ్‌ డైరెక్టర్‌ కృష్ణవంశీ తన కొత్త సినిమా ‘రంగమార్తాండ’ను షురూ చేశాడు.

తెరమీదకి ఉదయ్ కిరణ్ బయోపిక్ .. యంగ్ హీరో గ్రీన్ సిగ్నల్

ఉదయ్ కిరణ్.... ఎంత త్వరగా స్టార్ హీరోగా ఉదయించాడో.. అంతే త్వరగా డీలా పడిపోయాడు.

బీజేపీకి పవన్ షేక్ హ్యాండ్.. అందుకే ట్వీట్లు డిలీట్ చేశారా?

జనసేనాని పవన్ కళ్యాణ్ ట్విట్టర్ అకౌంట్ మరో సారి వార్తల్లోకి ఎక్కింది. ట్విట్టర్ వేదికగా ప్రజా సమస్యల్ని వినిపిస్తూ..