నేను గర్భవతిని కాదు.. ఆ ఫోటోస్ చూసి వీడియోలు చేస్తున్నారు!
Send us your feedback to audioarticles@vaarta.com
గాయనిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా సూపర్ క్రేజ్ సొంతం చేసుకుంది చిన్మయి. సమంత తో పాటు ఎందరో హీరోయిన్లకు చిన్మయి తన గాత్రంతో అద్భుతమైన డబ్బింగ్ అందించింది. చిన్మయి ఫెమినిస్టు భావజాలం ఉన్న మహిళ. అందుకే చిన్మయి తరచుగా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఎన్ని వివాదాలు ఎదురైనా చిన్మయి ధైర్యంగా ఎదుర్కొంటోంది.
ఇదీ చదవండి: షాకింగ్: పెళ్లి రద్దు చేసుకుని బిష్ణోయ్ తో విడిపోయిన మెహ్రీన్
తరచుగా చిన్మయి గురించి సోషల్ మీడియాలో గాసిప్స్ వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా కొందరు పుకారు రాయుళ్లు సృష్టించిన ఓ పుకారుపై చిన్మయి స్పందించింది. చిన్మయి గర్భవతి అంటూ సోషల్ మీడియాలో, యూట్యూబ్ ఛానల్స్ తో జోరుగా ప్రచారం జరిగింది.
దీనిపై స్పందించిన చిన్మయి తాను గర్భవతిని కాదు అని క్లారిటీ ఇచ్చింది. ఇటీవల నేను మా మరిది వివాహ వేడుకలో కనిపించాను.వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఆ ఫోటోలని నా భర్త సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ ఫొటోల్లో నన్ను చూసి చాలా మంది తల్లి కాబోతోంది అని అనుకున్నారు.
యూట్యూబ్ ఛానల్స్ వారైతే ఫేక్ హెడ్డింగులతో వీడియోలు కూడా వైరల్ చేసేశారు. అంతా ప్రచారం చేస్తున్నట్లు నేను గర్భవతిని కాదు. నా వ్యక్తిగత విషయాలని బయటకు చెప్పుకోవడం నాకు ఇష్టం ఉండదు. భవిష్యత్తులో కూడా నా వ్యక్తిగత విషయాలని పంచుకోను. ఒక వేళ భవిష్యత్తులో నేను గర్భవతిని అయితే ఆ విషయాన్ని సోషల్ మీడియాలో చెబితే చెబుతా లేకపోతే లేదు. ఎందుకంటే అది నా పర్సనల్ అని చిన్మయి క్లారిటీ ఇచ్చింది. ఇలాంటి ఫేక్ న్యూస్ తో తాను విసిగిపోయానని తెలిపింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com