చిన్మయిని ట్రోల్ చేస్తున్న నెటిజన్స్
Send us your feedback to audioarticles@vaarta.com
గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయిని నెటిజన్స్ టార్గెట్ చేశారు. సాధారణంగా మహిళల సాధికారికత గురించి చిన్మయి ఎప్పుడూ సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతుంటుంది. తాజాగా చిన్మయి భర్త, డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేసిన `మన్మథుడు 2`మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అయితే ఈ సినిమా టీజర్ విడుదల నుండి సినిమా విడుదల వరకు వివాదాలకు దారి తీసింది.
సినిమాలో నాగార్జున చేసిన లిప్ లాక్స్ సీన్స్, రకుల్, ఝాన్సీ మధ్య లిప్ లాక్ సీన్స్‌ని బేస్ చేసుకుని నెటిజన్స్ చిన్మయిని ట్రోల్ చేస్తున్నారు. సినిమాలోని అడల్ట్ కంటెంట్‌పై చిన్మయి తన భర్త రాహుల్ రవీంద్రన్‌ను ఎందుకు ప్రశ్నించలేదు? అంటూ నెటిజన్స్ చిన్మయిని విమర్శిస్తున్నారు. చిన్మయి తన కుటుంబంలోని వ్యక్తులతో ఒకలా.. బయటి వ్యక్తులతో మరోలా ప్రవర్తిస్తుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout