చిన్మయిని గెంటేశారు..
Send us your feedback to audioarticles@vaarta.com
మీ టూ ఉద్యమంలో భాగంగా దక్షిణాదిన డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్నయి ఊతమిచ్చారు. కొన్నిరోజుల ముందు ప్రముఖ లిరిసిస్ట్ వైరముత్తుపై ఆమె లైంగిక వేధింపుల ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచారు. ఈమె స్ఫూర్తితో చాలా మంది తాము ఎదుర్కొన్న లైంగిక సమస్యలను ట్విట్టర్ వేదికగా ఏకరువు పెట్టారు. అంతే కాకుండా తమిళనాడు ఫిలిం డబ్బింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు రాధారవిపై కొందరు చేసిన లైంగిక ఆరోపణలు చిన్మయి మద్ధతు ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఇది చిన్నయికి కష్టాలను తెచ్చిపెట్టినట్టుంది. తమిళ డబ్బింగ్ యూనియన్ నుండి ఆమె సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు చిన్మయి ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. అంతే కాకుండా రెండేళ్లు తన ఫీజులో నుండి పది శాతం ఎందుకు తీసుకున్నట్లు అని ప్రశ్నించారు కూడా. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా చిన్మయి సభ్యత్వాన్ని రద్దు చేశారని చిన్మయి తెలిపారు. అలాగే డబ్బింగ్ యూనియన్లో తనపై వేటు పడుతుందని ముందే ఊహించనట్లుగా కూడా ఆమె తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout