చైనా అమ్మాయితో ఇండియన్ పెళ్లి.. టెస్ట్‌లు చేయగా..!

  • IndiaGlitz, [Monday,February 03 2020]

చైనా.. కరోనా.. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మార్మోగుతున్నవి ఈ రెండే పేర్లు. ఎక్కడ చూసినా కరోనా భయం.. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఇప్పటికే సుమారు 25 దేశాలకు పాకిపోయిన ఈ డేంజరస్ కరోనా వైరస్.. ఎప్పుడు ఏ దేశానికి వ్యాప్తిస్తుందో..? ఏ రాష్ట్రానికి అంటుతుందో..? అని జనాలు బిక్కుబిక్కుమంటున్నారు. అక్కడ దేశీయులను ఇండియాను రానివ్వడం లేదు.. ఒకవేళ వచ్చిన టెస్ట్‌లు చేసి అంతా ఓకే అంటే అనుమతిస్తున్నారు లేదంటే నో ఛాన్స్. ఇలాంటి పరిస్థితుల్లో కూడా చైనా అమ్మాయి.. మధ్యప్రదేశ్ అబ్బాయి డేర్ స్టెప్ వేసి పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు.

అంతా ఓకే!
పూర్తి వివరాల్లోకెళితే.. మధ్యప్రదేశ్ కు చెందిన సత్యార్థ్ మిశ్రా, చైనా అమ్మాయి ఝిహావో.. కెనాడాలోని వాంగ్ షెరిడాన్ యూనివర్సిటీలో చదువుకునే సమయంలో ప్రేమించుకున్నారు. ఆ ప్రేమను పెళ్లి పీటలదాకా తీసుకెళ్లి ఒక్కటవ్వాలని భావించిన ఈ జంట.. పెద్దలను ఒప్పించారు. అన్నీ అనుకున్నట్లే జరిగాయి. వధువు తరఫున తల్లిదండ్రులు, బంధువులు చైనా పెళ్లికోసం చైనా నుంచి మధ్యప్రదేశ్‌కు తరలివచ్చారు. ఇంతవరకూ అంతా ఓకేగానీ.. వాళ్లు ఎంపీకి రావడంతో ఇక్కడ ప్రజల్లో టెన్షన్ మొదలైంది. అసలే కరోనా భయం.. ఆపై చైనీయులా..? అంటూ బెంబేలెత్తిపోయారు. ఈ హడావుడి.. ఆందోళన మధ్యనే రంగంలోకి దిగిన ప్రత్యేక వైద్యుల బృందం.. వధువు తల్లిదండ్రులకు కరోనా టెస్ట్‌లు నిర్వహించారు. ఈ పరీక్షల్లో వారికి కరోనా లక్షణాలు లేవని తేలడంతో హమ్మయ్యా అంటూ ఇరుకుటుంబీకులు, వైద్యులు. అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.

ఒక్కటయ్యారు!
అనంతరం ఆదివారం నాడు అక్కడ అమ్మాయి(చైనా)... ఇక్కడ అబ్బాయి (మధ్యప్రదేశ్) ఇద్దరూ మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. హిందూ సాంప్రదాయం ప్రకారమే ఈ పెళ్లి జరగడం విశేషమే. కాగా.. ఇప్పటి వరకూ ఈ కరోనా వైరస్‌తో వందలాది మంది మృత్యువాత పడగా.. మరికొందరు ఆస్పత్రుల పాలయ్యారు. మరీ ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ క్రమంలో తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. అంతేకాదు చైనాలో ఉన్న మన తెలుగు రాష్ట్రాల విద్యార్థులను ఇప్పటికే కొందరు సేఫ్‌గా ఇండియాకు రాగా.. మరికొందర్ని త్వరలోనే తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

More News

టీడీపీలో కాదు.. బీజేపీలోనే ఉన్నా..!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల అనంతరం వైసీపీ అధికారంలోకి రావడంతో.. పలువురు టీడీపీ ఎంపీలు ‘సైకిల్’ దిగి.. కాషాయ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే.

కరోనా ఎఫెక్ట్: పందులను ప్రాణంతోనే పాతేస్తున్నారు!

ప్రపంచ దేశాలను కరోనా వైరస్ వణికిస్తున్న సంగతి తెలిసిందే. చైనా వాళ్లంటే ప్రపంచమంతా హడలిపోయే పరిస్థితి నెలకొంది.

డిసెంబ‌ర్ 11న అజయ్ దేవగన్ 'మైదాన్' 

భారత దేశాన్ని ఫుట్ బాల్ రంగంలో ప్రపంచ పటంలో నిలిపిన ఫుట్ బాల్ కోచ్ యధార్థ కథ ఆధారంగా స్టార్ హీరో అజయ్ దేవగన్ హీరోగా రూపొందుతున్న చిత్రం `మైదాన్`.

'స్టాలిన్ ' ఆడియో వేడుక

జీవా. నటించిన తాజా చిత్రం పేరు స్టాలిన్. దీనికి అందరివాడు ఉపశీర్షిక. జీవా సరసన రియా సుమన్ నాయికగా నటించింది.

కార్తీ కెరీర్‌లో మరో మైలు రాయి.. బాలీవుడ్‌కు ‘ఖైదీ’

యాంగ్రీ హీరో కార్తీ కథానాయకుడిగా డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకంపై లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో