చైనాకు షాక్‌ల మీద షాక్‌లిస్తున్న భారత్

  • IndiaGlitz, [Wednesday,July 01 2020]

భారత్.. చైనాకు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తోంది. ఒక్కొక్క దానిపై నిషేధం విధిస్తూ కయ్యానికి కాలు దువ్వుతున్న చైనా బుద్ది చెప్పేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే చైనాకు సంబంధించిన 59 యాప్‌లపై నిషేధం విధించిన ఇండియా.. తాజాగా మరో షాక్ ఇచ్చింది. జాతీయ రహదారుల ప్రాజెక్టుల్లో చైనా కంపెనీలకు అనుమతిచ్చేదే లేదని స్పష్టం చేసింది.

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తాజాగా.. జాయింట్ వెంచర్లు, హైవే ప్రాజెక్టుల్లో చైనా కంపెనీలను తీసుకునేదే లేదని స్పష్టం చేశారు. అంతేకాదు ఆ దేశంతో భాగస్వామ్యం కలిగి ఉన్న ఏ జాయింట్ వెంచర్లను ఆమోదించబోమని తేల్చి చెప్పారు. ఎంఎస్ఈల్లో సైతం చైనా పెట్టుబడులకు అనుమతిచ్చేదే లేదని గడ్కరీ స్పష్టం చేశారు.

మరోవైపు చైనాతో చర్చలతో కాలయాపన అనవసరమని భావించిన భారత్.. ఊహించని రీతిలో శతఘ్నులు, యుద్ధ ట్యాంకర్లను సరిహద్దుకు చేర్చేసింది. చైనాను ధీటుగా ఎదుర్కొనేందుకు అవసరమైన శక్తివంతమైన ఆయుధాలన్నింటినీ ఇంత త్వరితగతిన చేరుస్తామని చైనా ఊహకు కూడా అందక మునుపే సరిహద్దుకు చేర్చేసింది.

More News

వైష్ణ‌వ్ నెక్ట్స్ కూడా డెబ్యూ డైరెక్ట‌ర్‌తోనే..!!

మెగా క్యాంప్ హీరో సాయ‌తేజ్ త‌మ్ముడు వైష్ణ‌వ్ తేజ్ పంజా కూడా ‘ఉప్పెన’ చిత్రంతో తెరంగేట్రం చేస్తోన్న సంగ‌తి తెలిసిందే.

‘నేటి చరిత్ర’ కరోనా సాంగ్ లాంచ్

పింక్స్ అండ్ బ్లూస్ (బ్యూటీ సె లూన్ అండ్ స్పా) సమర్పణలో  కరోనా పై  ఆళ్ళ రాంబాబు నటిస్తూ రూపొందించిన ‘నేటి చరిత్ర’ గీతం విడుదలైంది.

మరోసారి చై, సామ్ జోడీ..?

నాగ‌చైత‌న్య‌, సమంత జోడీ మ‌రోసారి స్క్రీన్‌పై సంద‌డి చేయ‌నున్నార‌నే వార్త‌లు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది.

జయరాజ్, బెన్నిక్స్‌ల మరణంపై దియా మీర్జా ట్వీట్

జయరాజ్, బెన్నిక్స్‌ అనే వ్యక్తుల మరణంపై మిస్ ఏషియా, ప్రముఖ నటి దియా మీర్జా స్పందించారు.

‘పుష్ప’ కోసం పాయ‌ల్ స్పెష‌ల్‌?

తొలి తెలుగు చిత్రం ‘ఆర్‌.ఎక్స్‌100’తో హాట్ బ్యూటీ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న పాయ‌ల్ రాజ్‌పుత్‌కు త‌ర్వాత చేసిన ఆర్.డి.ఎక్స్ ల‌వ్‌, వెంకీమామ‌, డిస్కోరాజా చిత్రాలు