చైనాలో మళ్లీ విజృంభిస్తోన్న కరోనా.. జూన్ చివరి నాటికి గరిష్ట స్థాయికి, వారానికి 6.5 కోట్ల కేసులు ..?
Send us your feedback to audioarticles@vaarta.com
దాదాపు రెండున్నరేళ్ల పాటు మనిషిని నాలుగు గోడలకు పరిమితం చేసి అన్ని వ్యవస్థలను కకావికలం చేసింది కోవిడ్ రక్కసి. ఈ మహమ్మారి పీడ అంతం అయ్యిందని అనుకుంటుంటే ఎప్పటికప్పుడు ఏదో ఒక కొత్త రూపంలో తిరిగి విజృంభిస్తోంది. తాజాగా తన పుట్టినిల్లు చైనాలో కరోనా విలయతాండవం చేస్తోంది. గడిచిన కొన్నిరోజులుగా అక్కడ భారీగా కేసులు నమోదవుతున్నాయి. పరిస్ధితి ఇలాగే కొనసాగితే జూన్ చివరి నాటికి వారానికి 6.5 కోట్ల కొత్త కేసులు నమోదయ్యే అవకాశం వుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ అప్రమత్తమైంది.
ఒమిక్రాన్ ఎక్స్‌బీబీ కారణంగానే కేసులు :
కాగా.. కోవిడ్ వెలుగులోకి వచ్చిన నాటి నుంచి చైనాలో రకాల వేరియంట్‌లు బీభత్సం సృష్టించాయి. తాజాగా ఒమిక్రాన్ ఎక్స్‌బీబీ వేరియంట్ కారణంగా ఏప్రిల్ నుంచి కేసులు పెరుగుతున్నాయి. మే చివరి నాటికి వారానికి 4 కోట్ల కేసులు నమోదయ్యే అవకాశం వుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. వైరస్ తీవ్రత నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగంగా అమలు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం వ్యాప్తి చెందుతోన్న ఒమిక్రాన్ ఎక్స్‌బీబీ వేరియెంట్లకు రోగ నిరోధక శక్తిని ఏమార్చే సామర్ధ్యం వుండటంతో.. దానిని ఎదుర్కొనే వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే రెండు టీకాలను అందుబాటులోకి తీసుకురాగా.. త్వరలోనే మరో నాలుగు కొత్త వ్యాక్సిన్లకు అనుమతులు లభించే అవకాశం వుందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. కాగా.. గతేడాది డిసెంబర్‌లో జీరో కోవిడ్ విధానానికి చైనా స్వస్తి పలికిన సంగతి తెలిసిందే. దీంతో కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. దీని కారణంగా దేశ జనాభాలో 85 శాతం కోవిడ్ బారినపడినట్లుగా వార్తలు వస్తున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments