చైనా నిమోనియా వైరస్ ముప్పు భారత్‌కు తక్కువే: కేంద్రం

  • IndiaGlitz, [Friday,November 24 2023]

ప్రపంచాన్ని అల్లకలోల్లం చేసిన కరోనా మహమ్మారి సృష్టించిన మారణహోమం నుంచి పూర్తిగా బయటపడకముందే చైనాలో మరో కొత్త రకం వైరస్ వార్తలు భయాందోళనను కలిగిస్తున్నాయి. ఇప్పటికీ పోస్ట్ కొవిడ్ సమస్యలతో సతమమతవుతున్న సమయంలో ఈ వార్త తీవ్ర కలవరం రేపుతోంది. ఉత్తర చైనాలో చిన్నారులు అంతుచిక్కని నిమోనియా లక్షణాల బారిన పడుతున్నారనే వార్తలపై కేంద్ర ఆరోగ్యశాఖ స్పందించింది. ఏవియన్‌ ఇన్‌ఫ్లుయెంజాల నుంచి భారత్‌కు ముప్పు తక్కువే ఉందని తెలిపింది.

ఈ శ్వాసకోశ వ్యాధులకు సంబంధించిన నివేదికలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు వెల్లడించింది. పిల్లల్లో శ్వాసకోశ అనారోగ్యానికి సంబంధించి అంతుచిక్కని వ్యాధికారకాలు, అసాధారణ లక్షణాలు వెలుగులోకి రాలేదని పేర్కొంది. అలాగే ఎలాంటి అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పుకొచ్చింది. కరోనా తర్వాత దేశంలో ఆరోగ్య మౌలిక సదుపాయాల్లో గణనీయమైన మార్పు వచ్చిందని వివరించింది.

మరోవైపు చైనాలో నమోదవుతున్న అంతుచిక్కని ఈ వ్యాధికి సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనాను కోరింది. జబ్బు లక్షణాలు, అనారోగ్యానికి గురవుతున్న చిన్నారులుండే ప్రాంతాల వివరాలు ఇవ్వాలని అధికారులను అడిగింది. అలాగే ఈ జబ్బు వ్యాప్తి చెందకుండా చైనా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అలాగే ప్రస్తుతానికి చైనాకు వెళ్లే ప్రయాణికులు శ్వాసకోస సంబంధిత వ్యాధులతో ఇబ్బందిపడుతోన్న వారికి దూరంగా ఉండాలని మాస్క్‌ను కచ్చితంగా వాడాలని సూచిస్తుంది.

More News

Barrelakka:బర్రెలక్కకు భద్రత కల్పించాలని హైకోర్టు ఆదేశాలు

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హాట్‌టాపిక్‌గా మారిన బర్రెలక్క అలియాస్‌ శిరీషకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది.

KTR:సామాన్యుడిలా మెట్రోలో ప్రయాణించిన మంత్రి కేటీఆర్

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు అన్ని పార్టీల నేతలు వినూత్నంగా ఆలోచిస్తు్న్నారు.

Sandeep Reddy:త్రివిక్రమ్, బోయపాటి అందుకే నచ్చరు: సందీప్‌ రెడ్డి

నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న ‘అన్‌స్టాపబుల్‌' టాక్ షో మూడో సీజన్‌ తాజా ఎపిసోడ్‌లో 'యానిమల్' టీమ్ సందడి చేసింది.

BRS Party:బీఆర్‌ఎస్ పార్టీకి భారీ షాక్.. కాంగ్రెస్‌లో చేరిన సిట్టింగ్ ఎమ్మెల్యే..

తెలంగాణ ఎన్నికల ప్రచారం నువ్వానేనా అనే రీతిలో సాగుతోంది. ఈ తరుణంలో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది.

Youtuber Nani:దండం పెట్టి చెబుతున్నా.. తాను ఏ తప్పు చేయలేదు: యూట్యూబర్ నాని

విశాఖ హార్బర్ ప్రమాద ఘటనపై యూట్యూబర్ లోకల్ బాయ్ నాని స్పందించాడు. ఈ ప్రమాదానికి తనకూ ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశాడు.