ఎల్ఏసీ దాటి రావడానికి చైనా బలగాలు యత్నిస్తున్నాయి: రాజ్‌నాథ్
Send us your feedback to audioarticles@vaarta.com
ఇండో- చైనా సరిహద్దుల్లో పరిస్థితి ఉద్రిక్తంగానే ఉందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లోక్‌సభలో పేర్కొన్నారు. భారత్-చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై రాజ్‌నాథ్ ఓ ప్రకటన చేశారు. వీర జవాన్లకు అండగా యావత్ దేశం వెన్నంటి ఉందని రాజ్‌నాథ్ పేర్కొన్నారు. గాల్వాన్‌లో చైనా దురాక్రమణకు...కల్నల్ సంతోష్ నేతృత్వంలో మన సైనికులు ధీటైన జవాబిచ్చారని పేర్కొన్నారు. 20 మంది భారత జవాన్లు అమరులయ్యారన్నారు. లద్దాఖ్‌లో 1962లో చైనా వేల కిలోమీటర్ల భూభాగం ఆక్రమించిందన్నారు. మొత్తం 90 వేల చదరపు అడుగుల భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందని రాజ్‌నాథ్ లోక్‌సభలో వెల్లడించారు.
చైనాతో సరిహద్దు సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదని రాజ్‌నాథ్ పేర్కొన్నారు. ప్రధాని మోదీ లడ్డాఖ్ వెళ్లి సైనికులను కలిసిన విషయాన్ని ఈ సందర్భంగా రాజ్‌నాథ్ గుర్తు చేశారు. భారత్ ఎప్పుడూ శాంతినే కోరుకుంటోందన్నారు. సరిహద్దు నిర్ణయానికి చైనా ఒప్పుకోవడం లేదన్నారు.
ఎల్ఏసీ విషయంలో రెండుదేశాల మధ్య వివాదాలున్నాయని రాజ్‌నాథ్ పేర్కొన్నారు. ద్వైపాక్షిక సంబంధాలు పెంచుకునేందుకు భారత్ ప్రయత్నిస్తోందన్నారు. చైనాతో భారత్ స్నేహపూర్వక సంబంధాలనే కోరుకుంటోందన్నారు. సరిహద్దుల విషయంలో భారత్ మంచి పరిష్కారం కోరుకుంటుంటోదన్నారు.సామరస్యపూర్వక చర్చలతోనే సరిహద్దు వివాదాలకు పరిష్కారం లభిస్తుందని రాజ్‌నాథ్ పేర్కొన్నారు.
ఎల్ఏసీ దాటి రావడానికి చైనా బలగాలు ప్రయత్నిస్తోందని.. అయితే భారత సైన్యం ఎప్పటికప్పుడు తిప్పికొడుతోందని రాజ్‌నాథ్ పేర్కొన్నారు. భారత జవాన్ల సాహసానికి పార్లమెంట్ సెల్యూట్ చేస్తోందన్నారు. మే నుంచి సరిహద్దుల్లో భారీగా ఆయుధాలు, సైన్యాన్ని చైనా మోహరిస్తోందన్నారు.
భారత్ కూడా అదే స్థాయిలో సైన్యాన్ని మోహరిస్తోందన్నారు. సరిహద్దులను మార్చాలన్న చైనా కుతంత్రాన్ని మన సైన్యం తిప్పికొట్టిందన్నారు. దేశ రక్షణ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. భారత బలగాలు దేశ గౌరవాన్ని పెంచుతున్నాయన్నారు. సైన్యం పూర్తి అప్రమత్తంగా ఉందని.. ఎలాంటి పరిస్థితుల్ని అయినా...ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments