ప్రపంచమా ఊపిరి పీల్చుకో.. చైనా రాకెట్ ముప్పు తప్పింది!

  • IndiaGlitz, [Sunday,May 09 2021]

అసలే కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేస్తుంటే గత కొద్ది రోజులుగా కొత్త భయం ప్రారంభమైంది. ఆ భయానికి ఇవాళ్టితో తెరపడింది. అది మరేదో కాదు చైనా రాకెట్ ‘లాంగ్ మార్చ్ 5 బీ’. 18 టన్నుల ఈ రాకెట్ ఎక్కడ పడుతుందోనన్న ఊహాగానాలు ప్రపంచాన్ని ఆందోళనలోకి నెట్టివేశాయి. దీని శకలాలు ఏ దేశంపై పడతాయో తెలియక ప్రపంచ దేశాలన్నీ భయాందోళనకు గురయ్యాయి. ఒకానొక దశలో ఢిల్లీపై కూడా పడతాయంటూ వార్తలొచ్చాయి. కాసేపటి క్రితం చైనా రాకెట్ శకలాలు హిందూ మహాసముద్రంలో కూలడంతో ప్రపంచమంతా ఊపిరి తీసుకుంది.

Also Read: ఆ తప్పు జీవితంలో చెయ్యను: చార్మి

భూ వాతావరణంలోకి రాగానే చాలా వరకూ శకలాలు పూర్తిగా మండిపోయాయి. కేవలం చిన్న చిన్న భాగాలు మాత్రమే సముద్రంలో పడిపోయాయి. నేటి ఉదయం శకలాలు భూ వాతావరణంలోకి ప్రవేశించాయి. అప్పటి నుంచి చైనా మ్యాన్‌డ్ స్పేస్ ఇంజినీరింగ్ ఆఫీస్ ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ వచ్చింది. హిందూ మహా సముద్రంపై రాకెట్ భాగాలు విచ్ఛిన్నమయ్యాయన్న విషయాన్ని ముందే వెల్లడించింది. ఈ శకలాలన్నీ 72.47 డిగ్రీల తూర్పు రేశాంశం, 2.65 డిగ్రీల ఉత్తర అక్షాంశం కలిసే ప్రాంతంలో కుప్పకూలాయి.

కాగా.. చైనా స్పేస్‌లో అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించ తలపెట్టింది. ఈ నిర్మాణ పనుల్లో భాగంగానే గతవారం ‘లాంగ్‌మార్చ్ 5 బీ’ అనే భారీ రాకెట్‌ను ప్రయోగించింది. అంతరిక్ష కేంద్ర కోర్ మడ్యూల్‌ను విజయవంతంగానే ఈ రాకెట్ మోసుకెళ్లింది. కానీ ఆ తరువాత రాకెట్ నియంత్రణ కోల్పోయింది. దాని శకలాలు సముద్ర జలాల్లో కాకుండా సాధారణ భూభాగంపై పడిపోయే ముప్పు ఉందని అంతరిక్ష రంగ నిపుణులు తొలుత ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం శకలాలన్నీ సముద్రంలోనే కూలిపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

More News

సాయం కోరిన మెహర్ రమేష్.. 24 గంటల్లో అందించిన సోనూసూద్

కరోనా మహమ్మారి భారత్‌లోకి ప్రవేశించినప్పటి నుంచి ప్రముఖ నటుడు సోనూసూద్ అందిస్తున్న సాయం మరువలేనిది.

ఆ తప్పు జీవితంలో చెయ్యను: చార్మి

పంజాబీ ముద్దు గుమ్మ చార్మీ కౌర్ పెళ్లి చేసుకోవడానికి ప్లాన్స్ చేసుకుంటున్నట్టు ఇటీవల మీడియాలో వార్తలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి.

జీ 5లో 'బట్టల రామస్వామి బయోపిక్కు' ఎక్స్‌క్లూజివ్‌ & డైరెక్ట్-టు-డిజిటల్ రిలీజ్

వీక్షకులకు వినోదం అందించడమే పరమావధిగా డైరెక్ట్-టు-డిజిటల్ రిలీజ్ సినిమాలు, ఒరిజినల్ వెబ్ సిరీస్‌లు, సరికొత్త సినిమాల విడుదలతో ఎప్పటికప్పుడు  సందడి చేస్తున్న అగ్రగామి ఓటీటీ వేదిక జీ 5.

హీరోలూ జీరోలవకండి.. కాస్త ఊపిరి అందించండి..

ప్రస్తుతం భారతదేశం ఎంత ప్రమాద స్థితిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కరోనా మహమ్మారి కారణంగా భారత్‌లో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి.

కడప జిల్లాలో జిలెటిన్ స్టిక్స్ పేలి 10 మంది మృతి

కడప జిల్లా కలసపాడు మండలంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మామిళ్ళపల్లె శివారులోని తిరుమల కొండ సమీపంలో ఉన్న బైరటీస్ గనిలో భారీ ప్రమాదం జరిగింది.