Chikoti Praveen:ఎట్టకేలకు బీజేపీలో చేరిన చీకోటి ప్రవీణ్.. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన డీకే అరుణ
Send us your feedback to audioarticles@vaarta.com
క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్ ఎట్టకేలకు తెలంగాణ బీజేపీలో చేరారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ సమక్షంలో చికోటి ప్రవీణ్ కాషాయం కండువా కప్పుకున్నారు. కొద్ది నెలల క్రితం నుంచే చీకోటి.. బీజేపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తు్న్నారు. అయితే బీజేపీలోని ఓ వర్గం ఆయన రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తోంది. అయితే ఇటీవల బీజేపీలో చేరేందుకు పార్టీ ఆఫీస్‌కు తన అనుచరులతో వెళ్తే అక్కడ ఘోర అవమానం జరిగింది. ఆయనకు కండువా కప్పేందుకు పార్టీ ఆఫీస్‌లో ఎవరు లేకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు. తాజాగా చికోటి ప్రవీణ్ చేరికకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మార్గం సుగమమైంది.
దేశ, విదేశాల్లో గ్యాంబ్లింగ్ క్లబ్‌లు, క్యాసినోల నిర్వహణ..
దేశంలో పాటు విదేశాల్లో గ్యాంబ్లింగ్ క్లబ్‌లు, క్యాసినోలను నిర్వహించే చీకోటీపై పలు క్రిమినల్ ఆరోణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ఈడీ విచారణకు కూడా హాజరయ్యారు. బ్యాంకాక్‌లో సారి క్యాసినో నిర్వహిస్తుంటే థాయ్‌లాండ్ పోలీసులకు పట్టుపడ్డారు. తర్వాత కొన్ని రోజులకు అక్కడి కోర్టు బెయిల్ ఇవ్వడంతో భారత్ తిరిగి వచ్చారు. అలాగే ఏపీలోని వైసీపీ నేతకు చీకోటితో చాలా సన్నిహిత సంబధాలున్నాయనే ప్రచారం ఉంది. గతంలో గుడివాడంలో చీకోటి ఆధ్వర్యంలో జరిగిన కేసీనో వ్యవహారం రాజకీయంగా పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పోటీ చేసేందుకు సిద్ధం..
ఈ నేపథ్యంలో ఇలాంటి వ్యక్తిని పార్టీలో చేర్చుకుంటే ఇబ్బందులు వస్తాయని రాష్ట్ర నేతలు ఆలోచిస్తూ వచ్చారు. అయితే రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్న చీకోటి ప్రవీణ్.. బీజేపీతో పాటు ఇతర పార్టీలోని సన్నిహితుల ద్వారా బీజేపీ అధిష్టానంపై ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. దీంతో హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఎట్టకేలకు కమలం తీర్థం పుచ్చుకున్నారు చీకోటి. ఇప్పుడు పార్టీలో చేరడంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఆయన సిద్ధమవుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments