లోఫర్ ఆడియోకి ముఖ్య అతిధి ఇతనే..
Send us your feedback to audioarticles@vaarta.com
మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ తాజాగా నటించిన చిత్రం లోఫర్. ఈ చిత్రాన్ని డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించారు. సి.కళ్యాణ్ ఈ చిత్రాన్నినిర్మించారు. వరుణ్ తేజ్ సరసన దిషా పటాని నటించింది. వరుణ్ తేజ్ కి తల్లిదండ్రులుగా పోసాని, రేవతి నటించారు. సునీల్ కశ్యప్ సంగీతాన్ని అందించారు.
డిసెంబర్ 8న లోఫర్ ఆడియోను సినీ ప్రముఖులు, అభిమానులు సమక్షంలో ఘనంగా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఆడియోకు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్టు సమాచారం. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని డిసెంబర్ 18న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయడానికి నిర్మాత సి.కళ్యాణ్ ఏర్పాట్లు చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com