‘విజయ్ మాల్యా, నీరవ్ మోదీ లాగే చిదంబరం కూడా..!’
Send us your feedback to audioarticles@vaarta.com
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత పీ చిదంబరానికి సుప్రీం కోర్టులో ఊరట లభించలేదన్న విషయం విదితమే. అరెస్ట్ నుంచి తక్షణ ఉపశమనం కల్పించాల్సిందిగా ఆయన చేసుకున్న అప్పీల్‌కు కోర్టు తోసిపుచ్చింది. మరోవైపు.. చిదంబరం అరెస్ట్‌కు సీబీఐ రంగం సిద్ధం చేసిన క్రమంలో గడిచిన 24 గంటల నుంచీ ఆయన అజ్ఞాతంలో ఉన్నారు. మరోవైపు చిదంబరం దేశం విడిచి వెళ్లకుండా ఆయనపై లుక్అవుట్ నోటీసులు జారీ అయ్యాయి.
కేంద్రం వ్యవహరిస్తున్న తీరును కాంగ్రెస్ నేతలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. మరోవైపు బీజేపీ నేతలు మాత్రం.. దర్యాప్తు సంస్థలకు సహకరించకుండా విజయ్ మాల్యా, నీరవ్ మోదీలా మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ నేత చిదంబరం వ్యవహరిస్తున్నారని బీజేపీ ఆరోపిస్తోంది. బుధవారం సాయంత్రం బీజేపీ ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు మీడియాతో మాట్లాడుతూ.. దర్యాప్తు సంస్థలకు సహకరించని చిదంబరం దేశం నుంచి పారిపోయిన పారిశ్రామికవేత్తలు విజయ్ మాల్యా, నీరవ్ మోదీల తరహాలో వ్యవహరిస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అవినీతికి పాల్పడిన ఏ ఒక్కరినీ మోదీ ప్రభుత్వం విడిచిపెట్టదని హెచ్చరించారు.
అసలేంటి ఈ ఆరోపణలు!
ఇదిలా ఉంటే.. 2007లో ఐఎన్ఎక్స్ మీడియా సంస్థకు విదేశాల నుంచి రూ. 305 కోట్ల నిధులు అందుకోవడానికి విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎఫ్ఐపీబీ) ఆమోదముద్ర వేయడంలో అప్పటి ఆర్థిక మంత్రి చిదంబరం నిబంధనలకు విరుద్ధంగా పచ్చజెండా ఊపారని ఆయన అభియోగాలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments