ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్.. మెగాస్టార్, రానా చిత్రాలకు షాక్..
Send us your feedback to audioarticles@vaarta.com
ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’, రానా దగ్గుబాటి ‘విరాటపర్వం’సినిమాలకు బిగ్ షాక్ తగిలింది. ఈ రెండు సిసినిమాలకు సెన్సార్ క్లియరెన్స్ ఇవ్వొద్దని హైదరాబాద్ ఆధారిత సంస్థ యాంటీ టెర్రరిజం ఫోరమ్ సెన్సార్ బోర్డుకు విజ్ఞప్తి చేసింది. ఈ రెండు సినిమాలు నక్సలైట్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్నందున క్లియరెన్స్ ఇవ్వొద్దని కోరుతోంది. ఇటీవల చత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 22 మంది జవాన్లు మృతి చెందారు. ఈ ఘటన తర్వాత మావోయిస్టులపై దేశ వ్యాప్తంగా తీవ్రస్థాయిలో వ్యతిరేకత వచ్చింది.
కాగా.. ‘ఆచార్య’, ‘విరాటపర్వం’ సినిమాలు నక్సల్ బ్యాక్‌డ్రాప్‌తో రూపొందుతున్నాయి. ఈ రెండు చిత్రాలకు అనుమతి ఇవ్వొదన్ని యాంటీ టెర్రరిజం ఫోరమ్ తాజాగా సెన్సార్ బోర్డుకు విన్నవించింది. ఈ సినిమాలే కాదు.. ఇక మున్ముందు సైతం నక్సల్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమాలు రాకుండా చూడాలని విజ్ఞప్తి చేసింది. తమ విన్నపాన్ని తోసిపుచ్చి ఈ సినిమాలకు అనుమతిస్తే కచ్చితంగా అడ్డుకుని తీరుతామని హెచ్చరించింది. ఈ క్రమంలో ఆచార్య, విరాటపర్వం చిత్రాలపై సెన్సార్ బోర్డు ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఆసక్తిగా మారింది.
కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తోన్న చిత్రమే ‘ఆచార్య'. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ దీన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా చేస్తోన్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రంలో చిరు, రామ్ చరణ్ నక్సలైట్లుగా నటిస్తున్నారు. ఇక రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలో ఉడుగుల వేణు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘విరాటపర్వం’. ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తుండగా.. ప్రియమణి, నివేదా పెతురాజ్, నందితా దాస్, నవీన్ చంద్ర తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com