చెన్నై కోసం జోలె పట్టిన హీరో

  • IndiaGlitz, [Thursday,December 03 2015]

నేను పుట్టింది ఇక్క‌డే అయినా చెన్నైలోనే పుట్టి పెరిగాను. ఇప్ప‌టికీ మా ఇల్లు చెన్నైలోనే ఉందని అంటున్నాడు. రాజుగారి గ‌ది ఫేమ్ చేత‌న్ చీను. రాజుగారిగ‌ది చిత్రం ద్వారా వ‌చ్చిన పారితోష‌కం, వారాహి చ‌ల‌న‌చిత్రం సాయికొర్ర‌పాటి ఇచ్చిన అడ్బాన్స్‌లో స‌గ‌భాగాన్ని చెన్నైలోని వ‌ర‌ద బాధితుల‌కు పంపాను. ఆ డబ్బుతో ఆహారాన్ని త‌యారు చేయించి పంచుతున్నారు. గ‌తంలో కార్గిల్ యుద్ద స‌మ‌యంలో కూడా నేను జోలె ప‌ట్టాను. ఎవ‌రైనా దాత‌లు త‌మ ద‌గ్గ‌రున్న దుస్తుల‌ను 9160251125 నెంబర్‌కు ఫోన్ చేసి ఇవ్వ‌వ‌చ్చు. దాన్ని చెన్నైలోని బాధితుల‌కు పంపుతాం అని చేత‌న్ చీను అన్నారు.